కాంతార చాప్టర్ 1.. ఈసారి తెలుగు బిజినెస్ ఎంత?
రూ.16 కోట్లతో నిర్మించిన మొదటి భాగంతో పోలిస్తే.. ప్రీక్వెల్ బడ్జెట్ అనేక రెట్లు ఎక్కువ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కూడా అదే రీతిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 2 Sept 2025 8:15 AM ISTకన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కిన కాంతార మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న చిత్రంగా కొన్నాళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో అలరించింది. ఇప్పుడు ఆ మూవీకి ప్రీక్వెల్ రూపొందుతోంది.
కాంతార చాప్టర్ 1గా వస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. అక్టోబర్ 2వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుండగా.. రూ.200 కోట్లతో రూపొందించినట్లు తెలుస్తోంది.
రూ.16 కోట్లతో నిర్మించిన మొదటి భాగంతో పోలిస్తే.. ప్రీక్వెల్ బడ్జెట్ అనేక రెట్లు ఎక్కువ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కూడా అదే రీతిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో హక్కుల కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది కొన్ని హీరోల సినిమాల బడ్జెట్ తో సమానం.
నైజాంలో రూ.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.45 కోట్లు, సీడెడ్ లో రూ.15 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తొలి భాగం సూపర్ సక్సెస్ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ కూడా వాటిని ఫుల్ గా పెంచుతున్నారు. అందుకే ప్రీక్వెల్ గా భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు అర్థమవుతోంది.
అయితే అప్పట్లో కాంతార మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ రూ.2 కోట్లకు పైగా జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.30 కోట్లుగా ఫిక్స్ అవ్వగా.. కాంతార మూవీ రూ.58.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.29.62 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవడంతో సినిమాను రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థ ఓ రేంజ్ లో లాభాలను అందుకుంది.
ఇప్పుడు ప్రీక్వెల్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవాలంటే రూ.170 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ ఫుల్ పాజిటివ్ గా వస్తే అది సాధ్యమవ్వడం సులభమే. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయిన వారం రోజులకు కాంతార ప్రీక్వెల్ రానుంది. మరి ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
