కాంతార ప్రీక్వెల్.. అడ్వాన్స్ బుకింగ్స్ అంత తక్కువా?
మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తొలుత కన్నడలో రిలీజ్ అవ్వగా.. భారీ విజయం సాధించింది.
By: M Prashanth | 1 Oct 2025 9:19 AM ISTమూడేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తొలుత కన్నడలో రిలీజ్ అవ్వగా.. భారీ విజయం సాధించింది. ఆ తర్వాత మేకర్స్ అన్ని భాషల్లో విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా.. రూ.350 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.
మేకర్స్ కు భారీ లాభాలు అందించిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ మూవీకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 రూపొందుతుండగా.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి మళ్లీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 2వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. నేడు కొన్నిచోట్ల ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి అయిన కాంతార ప్రీక్వెల్ కు అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా జరిగినట్లు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనుకున్నంత స్థాయిలో లేవని టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా ఏ సినిమాకు అయినా మొదటి పార్ట్ సూపర్ హిట్ అయితే.. రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పుడు కూడా కాంతార ప్రీక్వెల్ విషయంలో అదే జరిగింది. దీంతో ప్రీ బుకింగ్స్ భారీగా జరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. రూ.50-100 కోట్ల మధ్య ఉండొచ్చని లెక్కలు కూడా వేశారు.
కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1కి గాను రూ.20 కోట్ల తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రీమియర్స్ టికెట్స్ కు కూడా అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో భారీ అంచనాలు ఉన్న మూవీకి అంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్సా అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
ప్రమోషన్స్ తక్కువగా చేయడం వల్లే అలా జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే.. అడ్వాన్స్ బుకింగ్స్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రీమియర్స్ ను నుంచి పాజిటివ్ టాక్ స్టార్ట్ అయితే వసూళ్లకు తిరగుండదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
