కాంతార చాప్టర్ 1: హిందీ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..
దసరా సీజన్‌కి సరైన టైమింగ్‌లో రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బ్లాక్‌బస్టర్ సంచలనంగా మారింది.
By: M Prashanth | 6 Oct 2025 10:51 AM ISTదసరా సీజన్‌కి సరైన టైమింగ్‌లో రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బ్లాక్‌బస్టర్ సంచలనంగా మారింది. కన్నడలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. మొదటి పార్ట్ కాంతార అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత, ఈ ప్రీక్వెల్ మీద అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఇప్పుడు సినిమా ఆ అంచనాలను మించి సినిమా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు, రిషబ్ శెట్టి దర్శక ప్రతిభ, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక విజువల్ ట్రీట్‌గా మార్చేశాయి. సినిమా ప్రతి ఫ్రేమ్‌లో డివైన్ ఎనర్జీ, హ్యూమన్ ఎమోషన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతున్నాయి. దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాదు, హిందీ బెల్ట్ ఆడియన్స్ కూడా ఇప్పుడు కాంతార మేనియాలో మునిగిపోయారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా హిందీ వెర్షన్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే 68.50 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇది రిషబ్ శెట్టి కంటెంట్‌కి ఉన్న క్రేజ్‌ని చూపిస్తోంది. మొదటి రోజునుంచే ముంబై, ఢిల్లీ, లక్నో, చండీగఢ్ లాంటి నగరాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసేలోగా సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
సినిమా హిందీ వెర్షన్‌కి ఈ స్థాయిలో రిస్పాన్స్ రావడం అరుదైన విషయం. కంటెంట్‌కి లాంగ్వేజ్ అడ్డుగా ఉండదని మరోసారి నిరూపించింది. రిషబ్ శెట్టి నటన, కథలోని మెమోషనల్ కనెక్షన్స్ నార్త్ ఆడియన్స్‌కీ కనెక్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వసూళ్ల విషయానికి వస్తే, సినిమా రోజురోజుకీ వేగం పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అదే ఉత్సాహం కొనసాగుతోంది.
హిందీ వసూళ్ల లెక్కలు
డే 1: 17.50 కోట్లు
డే 2: 11 కోట్లు
డే 3: 19 కోట్లు
డే 4: 21 కోట్లు
మొత్తం: 68.50 కోట్లు (నెట్)
ఇదే స్పీడ్ లో కొనసాగితే, వచ్చే వారాంతానికే కాంతార చాప్టర్ 1 హిందీ వెర్షన్ 100 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పాజిటివ్ టాక్ సినిమా రన్‌కి బలమవుతోంది. హోంబలే ఫిలిమ్స్ కూడా నిర్మాణ విలువలతో మరోసారి తన స్టామినాను చూపించింది. ఇక సెకండ్ చాప్టర్ కు క్రేజ్ ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
