Begin typing your search above and press return to search.

కాంతార చాప్టర్ 1.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?

బ్లాక్ బస్టర్ హిట్ కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది.

By:  M Prashanth   |   18 Oct 2025 10:10 AM IST
కాంతార చాప్టర్ 1.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?
X

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ కాంతార: చాప్టర్ 1 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది.

విడుదల అయిన ఫస్ట్ షో నుంచి కూడా సినిమా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ఇంకా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో కాంతార ప్రీక్వెల్ రోజుకో సరికొత్త రికార్డును సృష్టిస్తూ సందడి చేస్తుందనే చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ.717 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.105 కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది. కన్నడలో ఓ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబడుతోంది. ఓవరాల్ గా రూ.800 కోట్ల దిశగా వెళుతోంది.

అయితే ఇప్పుడు కాంతార చాప్టర్ 1.. 2025లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలుస్తుందో లేదోనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆ రికార్డు.. బ్లాక్ బస్టర్ హిట్ చావా పేరు మీద ఉంది. కొన్ని నెలల క్రితం వచ్చిన ఆ సినిమా దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు సాధించింది.

శంభాజీ మహారాజ్‌ వీరగాథగా విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రం.. అందరినీ ఫిదా చేసింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ అదరగొట్టింది. ఇప్పుడు తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాల బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కాంతార ప్రీక్వెల్ కూడా అంతే విధంగా అలరిస్తోంది.

దీంతో కాంతార చాప్టర్ 1.. చావా రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా.. కాంతారకు సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. కాబట్టి మరికొన్ని రోజులపాటు కాంతార ప్రీక్వెల్ సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగించేలా కనిపిస్తోంది. మరేం జరుగుతుందో.. 2025 హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.