Begin typing your search above and press return to search.

కాంతార 1100 కోట్ల లెక్క.. మరో గోల్డెన్ ఛాన్స్ కూడా..

'కాంతార చాప్టర్ 1'.. ఇప్పుడు బాక్సాఫీస్‌కు ఇదే కింగ్ లాంటి సినిమా. సైలెంట్‌గా వచ్చి, సౌండ్ సిస్టమ్‌లు బద్దలయ్యేలా సౌండ్ చేస్తోంది.

By:  M Prashanth   |   17 Oct 2025 1:28 PM IST
కాంతార 1100 కోట్ల లెక్క.. మరో గోల్డెన్ ఛాన్స్ కూడా..
X

'కాంతార చాప్టర్ 1'.. ఇప్పుడు బాక్సాఫీస్‌కు ఇదే కింగ్ లాంటి సినిమా. సైలెంట్‌గా వచ్చి, సౌండ్ సిస్టమ్‌లు బద్దలయ్యేలా సౌండ్ చేస్తోంది. ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ మామూలుగా లేవు. మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్‌తో కలెక్షన్ల లెక్కపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ దైవిక గాథ ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా 717.50 కోట్లకు పైగా గ్రాస్‌ను కొల్లగొట్టి, చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది.


ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడిన ఆట చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం రెండు వారాల్లోనే, ఇక్కడ 105 కోట్లకు పైగా గ్రాస్‌ను లాగేసింది. ఒక కన్నడ సినిమా, అదీ ఒక ప్రీక్వెల్, మన బాక్సాఫీస్‌ను ఈ రేంజ్‌లో షేక్ చేయడం చూస్తే, కంటెంట్ కరెక్ట్‌గా కనెక్ట్ అయితే ఆడియన్స్ ఎలా బ్రహ్మరథం పడతారో మరోసారి ప్రూవ్ అయింది. KGF తరువాత పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిన కన్నడ సినిమాగా కాంతార వండర్ క్రియేట్ చేస్తోంది.


ఇప్పుడు ఈ సినిమాకు మరో గోల్డెన్ ఛాన్స్ దొరికింది. రాబోయేది దీపావళి వీకెండ్. ఈ పండగ హాలిడేస్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. దీనికి తోడు, ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో 'కాంతార'కు పోటీ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ సోలో రన్ సినిమా కలెక్షన్ల సునామీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయం.

ఇప్పుడు అసలు లెక్కలోకి వద్దాం. 2022లో వచ్చిన మొదటి 'కాంతార' అప్పట్లో ఒక గేమ్ చేంజర్. ఆ సినిమా వరల్డ్‌వైడ్‌గా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రీక్వెల్ ఆల్రెడీ 717 కోట్లను దాటేసింది. ఈ రెండింటినీ కలిపితే, 'కాంతార' అనే బ్రాండ్ బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేసేసిందన్నమాట. ఒక ప్రాంతీయ కథ, నేటివిటీని నమ్ముకుని తీసిన ఒక ఫ్రాంచైజీ ఈ రేంజ్ విజయం సాధించడం మామూలు విషయం కాదు.

రిషబ్ శెట్టి విజన్, హోంబలే ఫిల్మ్స్ ప్యాషన్ కలిసి ఒక సినిమాటిక్ వండర్‌ను క్రియేట్ చేశాయి. 'కాంతార' ఇప్పుడు కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్, ఒక బ్రాండ్. ఈ దీపావళి వీకెండ్ అడ్వాంటేజ్‌తో 'కాంతార చాప్టర్ 1' కలెక్షన్ల ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఇంకెన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో, ఎక్కడ ఆగుతుందో అని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.