Begin typing your search above and press return to search.

కొత్త 'కాంతార' దూకుడు.. 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

అప్పటి నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. మూవీ అదిరిపోయిందని అంతా రివ్యూస్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగిపోయాయి. ఓ రేంజ్ లో జరిగాయని చెప్పాలి.

By:  M Prashanth   |   8 Oct 2025 3:52 PM IST
కొత్త కాంతార దూకుడు.. 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
X

బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించారు. దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించింది.

అయితే అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కాంతార చాప్టర్-1 సినిమాకు కొన్నిచోట్ల ప్రీమియర్స్ ముందు రోజు పడ్డాయి. అప్పటి నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. మూవీ అదిరిపోయిందని అంతా రివ్యూస్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగిపోయాయి. ఓ రేంజ్ లో జరిగాయని చెప్పాలి.

అలా తొలి రోజు రూ.89 కోట్లు రాబట్టిన కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడు భారీ వసూళ్లు సాధిస్తోంది. కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. నార్త్ లో అదిరిపోయే వసూళ్లను కొల్లగొడుతోంది. ఓవర్సీస్ లో కూడా సినిమా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఇప్పటికే మూడు మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుని దూసుకెళ్తోంది.

ఫస్ట్ వీకెండ్ కల్లా ప్రపంచవ్యాప్తంగా రూ.231 కోట్లకు పైగా వసూలు చేసిన కాంతార ప్రీక్వెల్.. వీక్ డేస్ లో కూడా అదే జోష్ తో వసూళ్లను రాబడుతోంది. సోమవారం, మంగళవారం కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయిన ఆరు రోజులకు గాను రూ. 427.5 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

ఈ మేరకు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ కలెక్షన్ల వివరాలు పంచుకున్నారు. భక్తి, కథ చెప్పడం అనే తిరుగులేని శక్తి మరోసారి బాక్సాఫీస్‌ ను జయించిందని తెలిపారు. కాంతార చాప్టర్ 1 ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 427.5 కోట్లకు పైగా సాధించిందని, బ్లాక్ బస్టర్ మూవీని థియేటర్స్ లో వీక్షించాలని కోరారు.

ఇక సినిమా విషయానికొస్తే.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మంగా నిర్మించారు. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ నటించారు. జయరామ్, గుల్షన్‌ దేవయ్య, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, రాకేష్ పూజారి, దీపక్‌ రాయ్, హరిప్రశాంత్‌ ఎంజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్‌ లోకనాథ్‌ మ్యూజిక్ అందించారు. మరి ఫుల్ రన్ లో కాంతార చాప్టర్ 1 ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.