Begin typing your search above and press return to search.

కాంతారా 3 మిలియన్ క్లబ్.. కానీ..?

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా యూఎస్ లో మరో మైల్ స్టోన్ ని దాటేసింది. కాంతారా చాప్టర్ 1 సినిమా సక్సెస్ ఫుల్ గా 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   8 Oct 2025 11:40 AM IST
కాంతారా 3 మిలియన్ క్లబ్.. కానీ..?
X

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా యూఎస్ లో మరో మైల్ స్టోన్ ని దాటేసింది. కాంతారా చాప్టర్ 1 సినిమా సక్సెస్ ఫుల్ గా 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యింది. ప్రీమియర్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా ఓపెనింగ్ వీకెండ్ లో 2.9 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. ఇక లేటెస్ట్ గా సినిమా 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయినట్టు వెల్లడించారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యంగిరా సినిమాస్. రిషబ్ శెట్టి యాక్టింగ్ టాలెంట్ తో పాటు డైరెక్షన్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ మాత్రమే కాదు యూఎస్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.


కాంతారా చాప్టర్ 1 సో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే..

ఐతే ఈ సినిమా 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినందుకు హ్యాపీనే కానీ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ నుంచి ప్రత్యంగిరా సినిమాస్ 7 మిలియన్ డాలర్స్ కి రైట్స్ కొన్నారు. సినిమా రిలీజైన రేపటితో వారం అవుతుంది. వారం రోజుల్లో 3 మిలియన్ రాబట్టింది కాంతారా చాప్టర్ 1 సో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 4 మిలియన్ డాలర్స్ రాబట్టాల్సి ఉంటుంది. దానికి సినిమా ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది.

ఐతే సౌత్ భాషల్లో కాంతారా చాప్టర్ 1 ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. రిషబ్ శెట్టి యాక్టింగ్ కి పూనకాలు ఫీల్ అవుతున్నారు. హిందీ బెల్ట్ లో కూడా కాంతారా చాప్టర్ 1 పర్వాలేదనిపించేలా ఉంది. కానీ ఎటొచ్చి యూఎస్ మార్కెట్ లోనే సినిమా అంతగా దూకుడు చూపించట్లేదు. ప్రీ బుకింగ్స్, ఓపెనింగ్ డే కాస్త హడావిడి చేసినా సినిమా రిలీజైన ఐదారు రోజుల్లో 3 మిలియన్స్ రాబట్టింది.

హాలీవుడ్ సినిమాలు కాంతారా చాప్టర్ 1 మీద ఎఫెక్ట్..

ఇంకా దాదాపు 4 మిలియన్ డాలర్స్ తెస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు ఆ తర్వాత లాభాల గురించి మాట. పరిస్థితి చూస్తుంటే యూఎస్ లో కాంతారా చాప్టర్ 1 ఫుల్ రన్ లో మహా అయితే ఐదు మిలియన్లు అది కూడా అతి కష్టంగా ఉండేలా ఉంది. ఐతే పోటీగా హాలీవుడ్ సినిమాలు రావడంతో కాంతారా చాప్టర్ 1 మీద ఎఫెక్ట్ పడింది. మరి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ లో ప్రత్యంగిరా సినిమాస్ వారికి ఎలాంటి షాక్ తగులుతుందో చూడాలి.

కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్ స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మరోసారి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది.