కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్.. అసలు గేమ్ ఇప్పటినుంచే..
కాంతార.. కాంతార.. కాంతార.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 6 Oct 2025 12:51 PM ISTకాంతార.. కాంతార.. కాంతార.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. మూడేళ్ల క్రితం వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 రూపొందిన విషయం తెలిసిందే. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అయింది.
ముందు రోజు ప్రీమియర్స్ పడగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది విపరీతంగా స్ప్రెడ్ అవ్వగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరిగాయి. దసరా సెలవులు.. వీకెండ్ కలిసి రాగా.. దాదాపు నాలుగు రోజుల పాటు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. బుక్ మై షోలో 50 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ వివరాలు ఇలా..
ప్రీ సేల్స్: 916K
1వ రోజు: 1.28 మిలియన్లు
2వ రోజు: 1.27 మిలియన్లు
3వ రోజు: 1.30 మిలియన్లు
4వ రోజు: 1.04 మిలియన్లు
మొత్తం టిక్కెట్లు: 5.80 మిలియన్లు
బుక్ మైషోతోపాటు మిగతా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్, థియేటర్స్ లో టికెట్లు కూడా పెద్ద ఎత్తున సేల్ అయ్యాయి. దీంతో కాంతార డామినేషన్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. సౌత్ టు నార్త్ అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో కూడా దూసుకుపోతోంది. ఉత్తరాదిలో ఇప్పటి వరకు రూ.68 కోట్లకు పైగా సాధించింది. కాంతార హిందీ కలెక్షన్లు ఇలా..
1వ రోజు : రూ.17.50 కోట్లు
2వ రోజు: రూ.11 కోట్లు
3వ రోజు: రూ.19 కోట్లు
4వ రోజు: రూ.21 కోట్లు
అలా ఉత్తరాదిలో కూడా మంచి వసూళ్లు సాధించిన కాంతార ప్రీక్వెల్.. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ కు రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రూ.89 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఆ సినిమా.. శుక్రవారం రూ.65 కోట్లు రాబట్టింది. శనివారం రూ.82 కోట్లు వసూలు చేయగా.. ఆదివారం రూ.90 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తద్వారా రూ.300 కోట్లకు పైగా సాధించింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1కు అసలు పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే దసరా సెలవులు అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి. దీంతో అంతా ఎవరి పనుల్లో వారు బిజీ. కానీ సినిమా ఇప్పటి వరకు రూ.300 కోట్లు రాబట్టినా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చాలా దూరంగా ఉందనే చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లు సాధించాల్సి ఉంది. అప్పుడే బాక్సాఫీస్ వద్ద క్లీన్ గా హిట్ గా నిలుస్తోంది. అలా జరగాలంటే మేకర్స్ ప్రమోషన్స్ తో సందడి చేయాలి. ఇంకా సినిమాపై బజ్ క్రియేట్ చేయాలి. అప్పుడు మళ్లీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతాయి. సాలిడ్ వసూళ్లు వస్తాయి., మరేం జరుగుతుందో వేచి చూడాలి.
