Begin typing your search above and press return to search.

కాంతార చాప్టర్ 1: 7 రోజుల బాక్సాఫీస్.. టోటల్ ఎంతంటే..

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన 'కాంతార చాప్టర్ 1' సినిమా విడుదలకు ముందు బజ్ విషయంలో కాస్త డౌట్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తరువాత ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చింది.

By:  M Prashanth   |   9 Oct 2025 10:45 PM IST
కాంతార చాప్టర్ 1: 7 రోజుల బాక్సాఫీస్.. టోటల్ ఎంతంటే..
X

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన 'కాంతార చాప్టర్ 1' సినిమా విడుదలకు ముందు బజ్ విషయంలో కాస్త డౌట్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తరువాత ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చింది. కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ రావడంతో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ లెక్కలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా దసరా సీజన్ సినిమాకు పర్ఫెక్ట్ గా హెల్ప్ అయ్యింది.

ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కేవలం వారం రోజుల్లోనే కలెక్షన్లతో కాంతార మరో వండర్ క్రియేట్ చేసింది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన ఏ సినిమా కూడా సాధించని అత్యధిక మొదటి వారం రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. ఏకంగా 400 కోట్ల గ్రాస్ దాటడంతో కన్నడ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

ఈ అద్భుతమైన రికార్డ్ కేవలం కన్నడ సినిమాకే కాదు, యావత్ ఇండియన్ సినీ పరిశ్రమకు ఒక కొత్త బూస్ట్ ఇచ్చింది. కంటెంగ్ జనాలకు కనెక్ట్ అయితే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని ఈ సినిమా నిరూపించింది. కేరళ, తమిళనాడు కంటే తెలుగులోనే మంచి గ్రాస్ దక్కింది. కర్నాటకలో 100కోట్లకు పైగా రాబట్టిన కాంతార తెలుగులో 70 కోట్లకు పైగా గ్రాస్ అందుకోవడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

​'కాంతార' మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించినా, దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చాప్టర్ 1 కూడా అదే స్థాయిలో మౌత్ టాక్‌తో, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలదని సత్తా చాటింది. సినిమా కథాంశం, రిషబ్ శెట్టి మేకింగ్ మ్యాజిక్, సాంప్రదాయ కథాంశాన్ని కొత్తగా ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే మొదటి వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఏ మాత్రం తగ్గలేదు.

మొదటి ఏడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ సినిమా అందుకున్న గ్రాస్ కలెక్షన్ల వివరాలు ఈ విదంగా ఉన్నాయి (అంచనా)

​కర్ణాటక: 126.4 కోట్లు

​ఆంధ్రప్రదేశ్, తెలంగాణ : 74 కోట్లు

​కేరళ: 31.1 కోట్లు

​తమిళనాడు: 33.8 కోట్లు

​నార్త్ ఇండియా: 122.4 కోట్లు

​ఓవర్సీస్ : 70 కోట్లు

​మొత్తం ఏడు రోజుల్లో రూ.457.7 కోట్ల గ్రాస్‌

​ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆదరించడం వల్ల, సినిమా కలెక్షన్లు స్థిరంగా కొనసాగాయి. ఇది దాదాపు అన్ని ఏరియాలలో బయ్యర్లకు కనకవర్షం కురిపస్తోంది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ.. రెండూ దక్కించుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక ​రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరోసారి తన దర్శకత్వ, నటన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏది ఏమైనా, 'కాంతార చాప్టర్ 1' మొదటి వారం కలెక్షన్లు, 2025 సంవత్సరానికి ఒక రికార్డ్ బ్రేకింగ్ టార్గెట్‌ను సెట్ చేశాయి. ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో, అలాగే 'కాంతార' మ్యాజిక్ ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి.