కాంతార ప్రీక్వెల్.. రెండు రోజుల్లోనే ఆ క్లబ్ లోకి..
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Oct 2025 12:44 PM ISTబ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ విషయం తెలిసిందే. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా.. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదల అయింది. ఇప్పుడు థియేటర్స్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది.
ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకుని అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పిస్తోంది. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పిస్తోంది. దసరా లాంగ్ వీకెండ్ కావడంతో థియేటర్ అన్నీ కళకళలాడుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో కాంతార ప్రీక్వెల్ భారీ వసూళ్లను సాధిస్తోంది.
మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టిన కాంతార చాప్టర్ 1.. 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.89 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది కాంతార ప్రీక్వెల్. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిన కాంతార చాప్టర్-1.. రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే ఇండియా వైడ్ గా కాంతార చాప్టర్ 1 మూవీ.. పెయిడ్ ప్రీమియర్స్ తో తొలి రోజు రూ.61.85 కోట్ల రూపాయలు రాబట్టగా.. ఇప్పుడు రెండో రోజు 46 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ సంస్థ సాక్‌నిక్ తెలిపింది. దీంతో కేవలం రెండు రోజుల్లో మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అరుదైన ఘనతను సాధించింది.
ఓవర్సీస్ లో రెండు రోజులకు గాను రూ.13.5 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీంతో కాంతార చాప్టర్ 1 మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 134 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వీకెండ్ కాగా.. ఈ రెండు రోజులు భారీ వసూళ్లు సాధించేటట్లు కనిపిస్తోంది. సాలిడ్ నంబర్స్ నమోదవ్వడం పక్కా.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రామ్, హరిప్రసాద్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
