Begin typing your search above and press return to search.

కాంతార చాప్టర్ 1.. ఓవర్సీస్ లో మరో కిర్రాక్ రికార్డు!

తాజాగా అక్కడ ఉత్తర అమెరికాలో మిలియన్ మార్క్ డాలర్స్ రాబట్టింది కాంతార చాప్టర్ 1. కేవలం ప్రీమియర్స్ నుంచి ఆ సినిమా $500K సంపాదించింది.

By:  M Prashanth   |   4 Oct 2025 5:42 PM IST
కాంతార చాప్టర్ 1.. ఓవర్సీస్ లో మరో కిర్రాక్ రికార్డు!
X

మూడేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 రూపొందిన విషయం తెలిసిందే. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రానికి హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ గా నిర్మించారు. భారీ బడ్జెట్ తో సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

అయితే భారీ అంచనాల మధ్య కాంతార ప్రీక్వెల్.. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. వాటిని అందుకుని ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్నీ సెంటర్స్ లో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.

తొలి రోజు నుంచి సూపర్ హిట్ అందుకున్న కాంతార ప్రీక్వెల్.. రూ.89 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టింది. రెండో రోజే రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా సాధించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓవర్సీస్ లో కూడా కాంతార చాప్టర్ 1 ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

తాజాగా అక్కడ ఉత్తర అమెరికాలో మిలియన్ మార్క్ డాలర్స్ రాబట్టింది కాంతార చాప్టర్ 1. కేవలం ప్రీమియర్స్ నుంచి ఆ సినిమా $500K సంపాదించింది. ఇప్పుడు వీకెండ్ లో మరిన్ని వసూళ్లు కలెక్షన్లు సాధించేలా కూడా కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓవర్సీస్ ఉన్న సినీ ప్రియులు తెగ ఆసక్తి రేపుతున్నారు.

కాగా, సినిమా విషయానికొస్తే, జానపద కథలు, దైవిక అంశాలతో కూడిన చారిత్రక యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ లీడ్ రోల్ లో నటించారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడి పాత్రను పోషించారు. జయరామ్ సహాయక పాత్రలో కనిపించారు. ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, రాకేష్ పూజారి పలు రోల్స్ లో యాక్ట్ చేశారు.

వారితోపాటు దీపక్‌ రాయ్, హరి ప్రశాంత్‌ ఎంజీ తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌ నాథ్‌ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలును అరవింద్‌ ఎస్‌. కశ్యప్‌ నిర్వర్తించారు. 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరి ఫుల్ రన్ లో కాంతార చాప్టర్ 1 మూవీ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.