2030 లో కాంతారా చాప్టర్ -2 ?
కన్నడ సినిమాకు తెలుగు లో టికెట్లు రేట్లు పెంచడం ఏంటి? అన్న చర్చ జరిగింది. కానీ సినిమా చూసిన తర్వాత కొంత మంది ఆడియన్స్ ఒపీనియన్స్ కూడా మారాయి.
By: Srikanth Kontham | 4 Oct 2025 1:00 PM IST`కాంతార` అంటే మార్కెట్లో ఇప్పుడో సంచలన ప్రాంచైజీ. `కాంతార` అనూహ్యంగా హిట్ అవ్వడం అటుపై ఇటీవల రిలీజ్ అయినా `కాంతార చాప్టర్ 1` బ్లాక్ బస్టర్ అవ్వడంతో? `కాంతార` అంటే పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారింది. చాప్టర్ వన్ కు తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్ లో బ్రహ్మరధం పడుతున్నారు. సినిమా బాగుంటే? ఏ భాషా చిత్రమైనా తమకు ఒక్కటేనని మరోసారి రుజువు చేసారు. కన్నడ సినిమాకు తెలుగు లో టికెట్లు రేట్లు పెంచడం ఏంటి? అన్న చర్చ జరిగింది. కానీ సినిమా చూసిన తర్వాత కొంత మంది ఆడియన్స్ ఒపీనియన్స్ కూడా మారాయి.
క్లైమాక్స్ లోనే హింట్:
హొంబలే ఫిల్మ్స్ పెట్టిన ప్రతీ రూపాయి సినిమాలో కనిపించదని అభిప్రాయపడ్డారు. కాంతార మరోసారి కొత్త ప్రపంచంంలోకి తీసుకెళ్లిందని..నిడివి ఎక్కువగా ఉన్నా? ఇంకా చూడాలనిపించే ఆసక్తిని కలిగిందని థియేటర్ల వద్ద టాక్ కనిపిస్తోంది. మరి ఇంత పెద్ద హిట్ అయిన కాంతారకు చాప్టర్ -2 కూడా ఉందా? అంటే ఉందని రిషబ్ శెట్టి శుభం కార్డులో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `కాంతార చాప్టర్ -2` అంటూ అక్కడే చెప్పేసాడు. అయితే చాప్టర్ 2 మొదలు పెట్టడానికి..రిలీజ్ చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుంది.
చాప్టర్ -2 తో మరో ప్రపంచంలోకా:
ఏడాది రెండేళ్ల కాలంలో పూర్తయ్యే సినిమా కాదిది. చాప్టర్ 2కి సంబంధించి కథ ఎంత వరకూ సిద్దమదైంది? అసలు మొదలైందా? కొత్తగా కథ మొదలు పెట్టాలా? అన్నది తెలియాలి. అలాగే చాప్టర్ వన్ ని మంచి చాప్టర్ 2 ఉండాలి. ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాల మేరకు తీయాలి కాబట్టి? బడ్జెట్ కూడా మునుపటి కంటే రెండితలు అధికంగానే ఖర్చు అవుతుంది. చాప్టర్ 2 కథ కూడా ప్రేక్షకుల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. కాంతార క్లైమాక్స్ లో దైవ రూపంలో ఉన్న మనిషి అడవిలో అదృశ్యమవుతాడు.
కాంతార చాప్టర్ -2 పై అప్ డేట్:
దీంతో చాప్టర్ వన్ కథ అక్కడ నుంచే ప్రారంభమైంది. చాప్టర్ వన్ అదే ఆ పాత్రని ఓ గుహలో ముగించాడు. మరి చాప్టర్ -2 కథని గుహ నుంచి మొదలు పెడతారా? అన్నది సస్పెన్స్. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టినా? రిలీజ్ మాత్రం 2030లో ఉండేలా ఓ ప్రణాళిక ఇప్పటికే సిద్దం చేసి పెట్టాడని కన్నడ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేసిన తర్వాతే చాప్టర్ 2పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
