కాంతారా చాప్టర్ 1 రన్ టైం ఎంతంటే..?
రిషబ్ శెట్టి అన్ని తానై చేసిన సినిమా కాంతారా.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో కాంతారా చాప్టర్ 1 అంటూ ప్రీక్వెల్ ని ప్లాన్ చేశాడు.
By: Ramesh Boddu | 30 Sept 2025 9:38 AM ISTరిషబ్ శెట్టి అన్ని తానై చేసిన సినిమా కాంతారా.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో కాంతారా చాప్టర్ 1 అంటూ ప్రీక్వెల్ ని ప్లాన్ చేశాడు. కాంతారా 1 అక్టోబర్ 2న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. కాంతారా లో ఎలాంటి ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశాయో దానికి 10 టైమ్స్ ఎక్కువ కాంతారా చాప్టర్ 1 లో ఉన్నాయని తెలుస్తుంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్ లో బజ్ ఏర్పరచుకుంది.
సెన్సార్ టీం U/A సర్టిఫికెట్..
కాంతారా చాప్టర్ 1 సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ టీం యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా రన్ టైం కూడా 2:48 గంటలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలంలో స్టార్ సినిమాలు లెంగ్త్ ఎక్కువ ఉన్నా చెప్పాలనుకున్న కథ అలానే చెప్పాలని లెంగ్త్ విషయంలో రాజీ పడట్లేదు. కాంతారా చాప్టర్ 1 సినిమా కూడా మంచి రన్ టైం తోనే వస్తుంది.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి మరోసారి తన విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. కాంతారా సినిమాలో క్లైమాక్స్ లో ఎలా అయితే పూనకాలు పర్ఫార్మెన్స్ చేశారో ఈ సినిమాలో ప్రతి అంశం అలానే డిజైన్ చేశారని తెలుస్తుంది. కాంతారా చాప్టర్ 1కి ప్రత్యేక ఆకర్షణలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. కాంతారాని కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేసిన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ని 250 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి తీశారు.
తెలుగులో కూడా భారీ రిలీజ్..
కాంతారా చాప్టార్ 1 కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు సెన్సార్ టీం నుంచి మంచి టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అసలు ఫలితం ఏంటన్నది మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాక అర్ధమవుతుంది. ఈ సినిమా విజువల్స్ పరంగా గ్రాండియర్ గా ఉంటుందని తెలుస్తుంది. కాంతారా చాప్టర్ 1 ని తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారని తెలిసిందే.
దసరా కి పవర్ స్టార్ ఓజీ రన్ అవుతుంది. ఇక ధనుష్ ఇడ్లీ కొట్టు కూడా బుధవారం రిలీజ్ ఉంది. కాంతారా గురువారం రిలీజ్ అవుతుంది. సో దసరా బరిలో ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.
