Begin typing your search above and press return to search.

కాంతార : ఎదురు చూపులకు తెర పడే సమయం..!

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంతార : చాప్టర్ 1' వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

By:  Ramesh Palla   |   27 Oct 2025 10:18 AM IST
కాంతార : ఎదురు చూపులకు తెర పడే సమయం..!
X

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంతార : చాప్టర్ 1' వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇంకా కొన్ని చోట్ల సినిమా థియేట్రికల్‌ రన్‌ కొనసాగుతోంది. నాల్గవ వారంలోనూ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు కన్నడ బాక్సాఫీస్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. కాంతార సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో మొదటి నుంచి కాంతార : చాప్టర్ 1 పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఆ స్థాయిలో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడంలో రూపొందిన ఈ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా సౌత్‌లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. 2025 బిగ్గెస్ట్‌ కలెక్టెడ్‌ మూవీగా కాంతార : చాప్టర్ 1 నిలిచింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో కాంతార : చాప్టర్‌ 1

థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో చూసిన వారితో పాటు, ఇంకా కాంతార చాప్టర్ :1 చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ వైపు చూస్తున్నారు. ఇంకా ఎప్పుడు అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌ చేయబోతుంది. నాలుగు వారాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌ వీడియో సోషల్ మీడియా పేజ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేయడం జరిగింది. కాంతార పోస్టర్‌ను షేర్‌ చేసి లెజెండ్‌ కంటిన్యూస్‌... అంటూ త్వరలోనే స్ట్రీమింగ్‌ ఉండబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కాంతార : చాప్టర్‌ 1 పై ఉన్న అంచనాల నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. గతంలో కాంతార సినిమాకు వచ్చిన వ్యూస్‌తో పోల్చితే దాదాపుగా రెండు లేదా మూడు రెట్లు అధికంగా కాంతార : చాప్టర్‌ 1 కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు. అందుకే కాంతార 1 స్ట్రీమింగ్‌ డేట్‌ కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమెజాన్ నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాంతార కలెక్షన్స్‌ రికార్డ్‌

2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార : చాప్టర్‌ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. మొదటి కాంతార సినిమా దాదాపు రూ.450 కోట్ల వసూళ్లు రాబడితే కాంతార : చాప్టర్ 1 సినిమా ఇప్పటి వరకు రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరో వారం రెండు వారాలు సినిమాకు సాలిడ్‌ రన్‌ దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే నిజం అయితే సినిమా మరో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. ఓవరాల్‌గా సినిమా రూ.900 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలు అయితే థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ తక్కువ అవుతుంది. మొత్తంగా థియేటర్ల నుంచి సినిమా తొలగించే అవకాశం ఉంటుంది. అందుకే కాంతార 1 ఓటీటీ స్ట్రీమింగ్‌ను కనీసం రెండు వారాలు వాయిదా వేయాలని చాలా మంది బయ్యర్లు, కొందరు రిషబ్‌ శెట్టి అభిమానులు కోరుకుంటున్నారు.

రిషబ్‌ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్‌గా...

రిషబ్‌ శెట్టి ఈ కథను కాంతార అనే ప్రాంతం చుట్టూ నడిపించాడు. పకృతి, మానవ సంబంధాలు, సంఘర్షణల కాన్సెప్ట్‌తో రూపొందించడం జరిగింది. ఒక రహస్యమైన అడవి, అందులో ఉండే మనుషులు, వారి భావోద్వేగాలు, వారు పూజించే దేవుడు, వారు ఎదుర్కొన్న సమస్యల గురించి కాంతార : చాప్టర్‌ 1 లో చూపిస్తూ కథ నడిపించారు. ఈ క్రమంలో దేవుడి గురించి చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. స్థానికులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే విధంగా కథనం సాగింది. కొన్ని సీన్స్‌ సాగతీసినట్లుగా అనిపించినా ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. రివ్యూలతో సంబంధం లేదు అన్నట్లుగా ఏకంగా రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో, అతి త్వరలోనే రిషబ్‌ శెట్టి అన్నట్లుగానే కాంతార : చాప్టర్ 2 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రిషబ్‌ శెట్టి కాంతార సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి పోయాడు.