Begin typing your search above and press return to search.

కాంతార చాప్టర్ 1.. అవన్నీ ఉత్తుత్తి మాటలేనా..?

కాంతారా చాప్టర్ 1 సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. కాంతారా సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   25 Sept 2025 1:00 PM IST
కాంతార చాప్టర్ 1.. అవన్నీ ఉత్తుత్తి మాటలేనా..?
X

కాంతారా చాప్టర్ 1 సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. కాంతారా సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. హోంబలే బ్యానర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా అది. ఐతే కాంతారా ప్రాక్వెల్ గా చాప్టర్ 1 రాబోతుంది. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి అండ్ టీం కష్టపడుతున్నారు. ఫైనల్ గా సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడన్న టాక్ వచ్చింది. ఐతే అసలు జరిగింది మాత్రం వేరే అట.

కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి రెమ్యునరేషన్..

రిషబ్ శెట్టి కాంతారా ముందు వరకు కేవలం ఒక కన్నడ యాక్టర్ మాత్రమే. కానీ కాంతారా రిలీజ్ తర్వాత ఆయన టాలెంట్ అందరికీ తెలిసిందే. కాంతారా చాప్టర్ 1 తో మరింత ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నాడు. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం రిషబ్ శెట్టి ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేశాడట. సినిమా కోసం రిషబ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న టాక్ ఉంది. కానీ అది నిజం కాదని టాక్.

రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కాకుండా మినిమం ఖర్చులు వరకే తీసుకున్నారట. రెమ్యునరేషన్ గా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నానని చెప్పాడట. హోంబలే బ్యానర్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కాంతారా సినిమా 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా ఫుల్ రన్ లో 400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇక కాంతారా చాప్టర్ 1 అయితే 250 కోట్ల బడ్జెట్ తో వస్తుంది.

రిషబ్ శెట్టి ఫ్యామిలీ దేవుడి పూనకాలు..

ఈ సినిమా మరింత భారీగా ప్రతి అంశం గూస్ బంప్స్ తెప్పించేలా చేస్తుందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ అంచనాలు పెంచింది. తప్పకుండా రిషబ్ శెట్టి మరోసారి కాంతారా చాప్టర్ 1 తో ఇంపాక్ట్ చూపించేలా ఉన్నాడు. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె నటించడం కూడా ఆడియన్స్ కి ఆసక్తి కలిగిస్తుంది. కాంతారా సినిమా కర్ణాటక లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా. ఐతే అందులో రిషబ్ శెట్టి ఫ్యామిలీ దేవుడి పూనకాలు కలిగి ఉంటారు. తరాలుగా వస్తున్న ఈ ఆచారానికి వాళ్ల ఫ్యామిలీ అంతా కూడా కట్టుబడి ఉంటారు. ఐతే కాంతారా సినిమాలో చాలా విషయాలు వెనక కథ చెప్పలేదు.

కాంతారా చాప్టర్ 1 లో వాటికి ఆన్సర్ ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా కాంతారా లో ఎలా అయితే క్లైమాక్స్ లో పూనకాలు తెప్పించాడో.. ఈ సినిమాలో కూడా దానికి మించిన పర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తుంది.