Begin typing your search above and press return to search.

రిషబ్ 'కాంతార చాప్టర్ 1'.. ఇండియాలో మొదటిసారి ఇలా..

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ.. డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   22 Oct 2025 3:21 PM IST
రిషబ్ కాంతార చాప్టర్ 1.. ఇండియాలో మొదటిసారి ఇలా..
X

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ.. డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన కాంతార ప్రీక్వెల్.. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 2వ తేదీన దసరా కానుకగా గ్రాండ్ గా సినిమా విడుదలైంది.

అక్టోబర్ 1వ తేదీన రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ పడగా.. అప్పటి నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించి.. తొలి రోజు నుంచి దూసుకుపోతోంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు అయినా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటే దిశగా సాగుతోంది.

అయితే భారతీయ భాషల్లో భారీ విజయం సాధించడంతో పాటు వసూళ్లు రాబట్టిన కాంతార ప్రీక్వెల్ ను ఇప్పుడు ఇంగ్లీష్‌ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అక్టోబర్ 31వ తేదీన కాంతార ఛాప్టర్ 1ను ఇంగ్లీష్‌ వెర్షన్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టర్ ను రిలీజ్ చేసి ఆ విషయాన్ని ప్రకటించారు.

అదే సమయంలో ఇంగ్లీష్ లో రిలీజ్ కానున్న కాంతార చాప్టర్ 1 మూవీ అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంగ్లీష్ లో డబ్ అయ్యి విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ ఆ ఫీట్ ను అందుకుంది. మరో వారం రోజుల్లో సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ కోసం సినిమాలో కొన్ని సన్నివేశాలు మేకర్స్ కట్ చేశారు. మూవీ రన్ టైమ్ ను రెండు గంటల 14 నిమిషాలకు కుదించారు. ఏకంగా 35 నిమిషాల సీన్స్ ను తీసేశారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో భారతీయ భాషల్లో సినిమా.. 169 నిమిషాల (రెండు గంటల 49 నిమిషాల) రన్ టైమ్ తో ప్రదర్శితమవుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో కాంతార ప్రీక్వెల్ ను రూపొందించారు. యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్.. రిషబ్ శెట్టి సరసన హీరోయిన్ గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య సహా అనేక మంది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. మరి మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.