నైజాంలో 'కొత్త' కాంతార.. ఆ క్లబ్ లోకి ఎంట్రీ..
కోలీవుడ్ స్టార్ హీరో యష్ నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కేజీఎఫ్-2 మూవీ.. ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నైజాంలో ఆ సినిమా రూ.30 కోట్ల ఎక్కువ షేర్ వసూలు చేసింది.
By: M Prashanth | 9 Oct 2025 4:44 PM ISTమూడేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటించి, దర్శకత్వం వహించిన ఆ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పటికే రూ.400 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
రికార్డు స్థాయిలో వసూళ్లతో సందడి చేస్తున్న కాంతార ప్రీక్వెల్.. రూ.500 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. ఆరు రోజుల్లో రూ.427.5 కోట్లు సాధించినట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించగా.. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.475 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. వీక్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.
అయితే నైజాంలో కాంతార చాప్టర్ 1.. మొదటి వారం రూ.21.8 కోట్ల షేర్ ను సాధించినట్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాల సమాచారం. కంప్లీట్ థియేట్రికల్ రన్ లో రూ.30 కోట్లకు పైగా షేర్ ను రాబట్టడం గ్యారెంటీగా తెలుస్తోంది. అది జరిగితే నైజాం ఏరియాలో కాంతార ప్రీక్వెల్ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. కేజీఎఫ్-2 సరసన చేరనుంది.
కోలీవుడ్ స్టార్ హీరో యష్ నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కేజీఎఫ్-2 మూవీ.. ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నైజాంలో ఆ సినిమా రూ.30 కోట్ల ఎక్కువ షేర్ వసూలు చేసింది. అలా రాబట్టిన ఏకైక డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా కేజీఎఫ్ సీక్వెల్ ఉన్న క్లబ్ లో కూడా చేరేలా కనిపిస్తోంది.
ఇక కాంతార చాప్టర్ 1 విషయానికొస్తే.. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ సహ పలువురు నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి రూ. 125 కోట్ల రూపాయలతో రూపొందించినట్లు తెలుస్తోంది. మరి ఫుల్ రన్ లో కాంతార ప్రీక్వెల్ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
