కాంతార లక్.. ఇతర సినిమాల పరిస్థితి ఏంటో?
ఆ ఉపశమనం సమయంలో కాంతార సినిమా విడుదలైంది. కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా కోర్టు నుంచి స్టే దక్కింది.
By: Ramesh Palla | 15 Oct 2025 11:42 AM ISTకన్నడ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో షాకింగ్ జీవోను జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ జీవో ప్రకారం ఏ థియేటర్‌లో అయినా, మల్టీప్లెక్స్‌లో అయినా టికెట్ల రేట్లు రూ.250 మించకూడదు. ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తుందని, సినిమా ఇండస్ట్రీకి సైతం పెద్దగా నష్టం ఉండదు అని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. కన్నడ ముఖ్యమంత్రి ఈ విషయమై చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్లను మళ్లీ పెంచే ఉద్దేశం లేదని అన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి న్యాయస్థానంకు వెళ్లడంతో కోర్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆ ఉపశమనం సమయంలో కాంతార సినిమా విడుదలైంది. కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా కోర్టు నుంచి స్టే దక్కింది.
కాంతార చాప్టర్ 1 సినిమా వసూళ్లు
కోర్ట్ నిర్ణయంతో కాంతార ఛాప్టర్ 1 సినిమాకు చాలా లాభం చేకూరింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. టికెట్ల రేట్ల పరిమితి లేకపోవడంతో రూ.500 నుంచి రూ.2000 వరకు టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం దక్కింది. అలా కర్ణాటకలో టికెట్ల రేట్లను భారీగా పెంచడంతో రికార్డ్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 సినిమాకు కర్ణాటకలో దాదాపుగా రూ.165 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక వేళ టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేకుంటే ఖచ్చితంగా రూ.100 కోట్ల వద్దే కాంతార చాప్టర్ 1 సినిమా వసూళ్లు ఆగిపోయేవి అనేది బాక్సాఫీస్ వర్గాల అంచనా. కాంతార చాప్టర్ 1 కి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే లాంగ్ రన్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక కోర్ట్ నిర్ణయంతో టికెట్ల రేట్లు పెంపు
కాంతార చాప్టర్ 1 సినిమా కన్నడంతో పాటు ఇతర భాషల్లోనూ భారీగా వసూళ్లు నమోదు చేసింది. తెలుగులో మొదటి వారం రోజులు మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ప్రస్తుతానికి పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు దీపావళి సీజన్ రానున్న కారణంగా కాంతార చాప్టర్ 1 మళ్లీ వసూళ్లు పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది మరికొందరి అభిప్రాయం. ఓవరాల్‌గా కాంతార సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని మొదటి నుంచి మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అది నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఇంకాస్త స్ట్రాంగ్‌గా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మొదటి కాంతారతో పోల్చుతూ ఈ కాంతార వసూళ్ల విషయంలో మేకర్స్ సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో టికెట్ల రేట్లు...
కోర్ట్ నిర్ణయం కారణంగా కాంతార చాప్టర్ 1 సినిమాకు లక్ కలిసి వచ్చి, భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే త్వరలో కర్ణాటక ప్రభుత్వం నుంచి కోర్ట్‌లో కౌంటర్ దాఖలు చేయనున్నారు. టికెట్ల పెంపుకు ఒప్పుకునేది లేదు అంటూ ప్రభుత్వం బలంగా వాదించే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకుల మీద ఏ స్థాయిలో భారం పడుతుందో లెక్కలతో సహా చూపించడం వల్ల కోర్ట్ తీర్పును తమకు అనుకూలంగా ప్రభుత్వం తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కనుక ముందు ముందు రాబోతున్న సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాలు ఉండక పోవచ్చు. కాంతార లక్ తో టికెట్ల రేట్ల పెంపుకు అవకాశం దక్కింది. కానీ ఇతర సినిమాలకు ఆ పరిస్థితి ఉండక పోవచ్చు. అదే నిజం అయితే పెద్ద సినిమాలు వందల కోట్లు నష్టపోయే అవకాశం ఉంది.
