కాంతార ప్రీక్వెల్.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత..
కాంతార చాప్టర్ 1 మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 509.25 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ రన్ లో కొనసాగుతోంది.
By: M Prashanth | 10 Oct 2025 2:05 PM ISTకన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 మూవీ.. మొదటి షో నుంచి కూడా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అలరిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను పెద్ద ఎత్తున థియేటర్స్ ను రప్పిస్తోంది.
తాజాగా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లను రాబట్టింది. తద్వారా ప్రతిష్టాత్మక రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో కొత్త పోస్టర్ ను షేర్ చేయగా.. అది అందరినీ పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.
"బాక్సాఫీస్ వద్ద డివైన్ మూవీ తుఫాను మరింతగా దూసుకుపోతోంది. కాంతార చాప్టర్ 1 మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 509.25 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ రన్ లో కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ మీ సమీపంలోని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది" అని తెలిపింది.
అయితే వస్తున్న వీకెండ్ లో థియేటర్స్ లో పెద్ద సినిమాల ఏవీ సందడి చేయకపోవడంతో కాంతార మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. అదే సమయంలో సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు ఇంకా దూరంలో ఉంది. కాబట్టి మరో వారం పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడితే ఈజీగా చేరుకుంటుంది.
ఇక సినిమా విషయానికొస్తే.. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ సహ పలువురు నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించగా.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
