కాంతార 3: ఎన్టీఆర్ సెట్టయితే పూనకాలే..
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన కాంతార సిరీస్ దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Aug 2025 11:17 AM ISTహోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన కాంతార సిరీస్ దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. 2018లో వచ్చిన మొదటి భాగం తర్వాత కాంతార ప్రీక్వెల్‌తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమవుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రీక్వెల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడే ‘కాంతార 3’కి సంబంధించి హాట్ టాపిక్ వెలుగులోకి వచ్చింది.
ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న గుసగుసలు
కాంతార 3 ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చే సాగుతోంది. ఈసారి కథలో మరో లెవెల్‌కు వెళ్లాలనుకుంటున్న రిషబ్ శెట్టి, విభిన్నమైన కథాంశాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో ఒక తెలుగు స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్‌కి సినిమాలను తీసుకెళ్లడంలో బిజీగా ఉండగా, ‘కాంతార 3’లో ప్రత్యేకమైన కాంబో చూడొచ్చని ఫిలింనగర్ టాక్.
ఎన్టీఆర్ సెట్టయితే..
ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట గట్టిగా వినిపిస్తున్న పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘కాంతార 3’లో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నాడని, ఆ పాత్ర చిత్రానికి భారీగా క్రేజ్ తీసుకొచ్చేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ సెట్టయితే అది ఇండియన్ సినిమా స్థాయిలో ఓ బ్లాక్‌బస్టర్ అప్‌డేట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. రిషబ్ శెట్టి కథలకు, ఎన్టీఆర్ యాక్షన్, ప్రెజెన్స్‌కు క్రేజీ ఫాలోయింగ్ ఉన్నందున ఈ కాంబోపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అసలు ఇదంతా ఎలా జరిగిందంటే..
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ఎన్టీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ స్టేజిలోనే ఎన్టీఆర్ పేరు ఫిక్స్ అయిందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిషబ్ శెట్టి కూడా తన కథకు ఎన్టీఆర్ అయితే బెస్ట్ అని భావిస్తున్నారని టాక్. ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకుంటే ఇది అతడి కెరీర్‌లో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
కాంబో సెట్స్ పైకి వస్తే బాక్సాఫీస్ హిట్ ఖాయం
ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కాంబో వర్కౌట్ అయితే సౌత్ లోనే కాదు, నార్త్ బాక్సాఫీస్‌లో కూడా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. ఇప్పటికే కాంతార ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఎన్టీఆర్ మార్కెట్‌ను కలిపితే ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్‌కి ఓ కొత్త ట్రెండ్ గా నిలవొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వస్తున్న ఈ సమయంలో ఇలా ఒక క్రేజీ కాంబో కుదిరితే ఫ్యాన్స్‌కు పండగే.
