'కన్నప్ప' బ్యూటీ సైలెంట్ గా షాక్ ఇచ్చిందే!
మంచు ఫ్యామిలీ సినిమా కావడం సహా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రచారం దక్కడంతో? ప్రీతీ ముకుందన్ పేరు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.
By: Srikanth Kontham | 6 March 2026 12:26 PM IST'కన్నప్ప' చిత్రంతో ప్రీతీ ముకుందన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన బ్యూటీ. అప్పటికే టాలీవుడ్ లో 'ఓం బీం భుష్ 'అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా? ఆ సినిమా రీచ్ అవ్వకపోడంతో ప్రీతీ పేరు ఎక్కడా బయటకు రాలేదు. అలాగని 'కన్నప్ప' హిట్ చిత్రం కాదు. మంచు ఫ్యామిలీ సినిమా కావడం సహా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రచారం దక్కడంతో? ప్రీతీ ముకుందన్ పేరు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. నెమలి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంత్ర ముగ్దుల్నిచేసింది. ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమాలో ఛాన్స్ అందుకోలేదు.
కానీ ఈ బ్యూటీ చాప కింద నీరులా బాలీవుడ్ లో కూడా విస్తరిస్తుంది. ఏకంగా ఓ సినిమా షూటింగ్ ని సైతం క్లైమాక్స్ కు తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా మృగ్ దీప్ సింగ్ లాంబా 'నాగ్జిల్లా' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్లగా చాలా మంది భామల్ని పరిశీలించారు. కానీ ఎవర్ని ఎంపిక చేసారు ? అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో హీరోయిన్ స్థానం ఇంకా ఖాళీగానే ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ స్థానంలో ప్రీతీముకుందన్ ఎంపిక చేసి సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి కీలకమైన సన్నివేశాలు పూర్తి చేసారు. మరో ఏడు రోజుల పాటు షూటింగ్ కు హాజరైతే ఆమె పార్టు పూర్తవుతుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. ప్రీఈతీ కూడా ఎక్కడా రివీల్ చేయలేదు. సైలెంట్ గా షూట్ పూర్తిచేసి షాక్ ఇచ్చింది. హీరోయిన్ పాత్రకు ప్రీతీ పర్పెక్ట్ గా సూటవుతుందనే ఆమెను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో కార్తీక్ ఆర్యన్ నాగ్ అనే సర్పం పాత్ర పోషిస్తున్నాడు. ప్రీతీ ముందుకుందన్ పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మాత్రం రివీల్ చేయలేదు.
ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్- మహవీర్ జైన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ విషయానికి వస్తే తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడా అమ్మడు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇంత వరకూ బిజీ నటిగా మారలేకపోయింది. ప్రస్తుతం తమిళ్ లో 'ఇదయాం మురళీ', తెలుగులో 'ఏమో ఏమో ఇది' చిత్రాల్లో నటిస్తోంది.
