ఇండస్ట్రీలో మొదలైన కొత్త ఉద్యమం.. యంగ్ బ్యూటీస్ అసహనం!
కన్నడ బ్యూటీలైన సప్తమి గౌడ, ఆశికా రంగనాథ్, రుక్మిణీ వసంత్ తాజాగా తమ ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
By: Madhu Reddy | 3 March 2026 11:32 PM ISTప్రస్తుతం కన్నడ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెడుతున్న పోస్ట్లు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త ఉద్యమం మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చాలా హుందాగా, లగ్జరీగా జీవితాన్ని గడుపుతూ ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే బయటకి మేడిపండు వలే చాలా చక్కగా కనిపించినా.. లోపల వారు ఎదుర్కొనే ఇబ్బందులు బయట వారికి కనిపించవు. దీనికి తోడు సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి బయట ఎక్కడ కనిపించినా సరే అభిమానులు లేదా సామాన్య ప్రజలు వారితో కరచాలనం చేయాలని, మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని ఇలా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమంది ఆకతాయిలు మాత్రం కెమెరాలతో జూమ్ చేసి మరీ ఫోటోలు తీస్తుండడంతో యంగ్ బ్యూటీస్ ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండిపడుతున్న సెలబ్రిటీలు..
అసలు విషయంలోకి వెళ్తే.. సెలబ్రిటీలకి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి తమ బిజినెస్ ను అభివృద్ధి వైపు అడుగులు వేయించడానికి ఆయా సంస్థల యజమానులు సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి మరీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటారు. మరొకవైపు తమ బ్రాంచ్లను సెలబ్రిటీల చేత ప్రారంభిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలను ఆహ్వానించినప్పుడు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా సెలబ్రిటీలు తమ షాప్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు అని.. వారం ముందే ప్లకార్డులు వేసి మరీ ఆయా సంస్థలు ప్రమోట్ చేసుకుంటున్నాయి కూడా. అలా సదరు సెలబ్రిటీలను చూడడానికి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలను ఫోటోలు తీసే నెపంలో జూమ్ చేసి మరీ వారి శరీర భాగాలను ఫోటోలు తీస్తుండడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక బహిరంగ సభలోనే కాదు సినిమా ఈవెంట్లలో కూడా తమకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని నటీమణులు బాధపడుతున్నారు.
శరీర భాగాలను జూమ్ చేసి మరీ ఫోటోలు తీస్తున్నారంటూ..
ఈ క్రమంలోనే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ బ్యూటీలైన సప్తమి గౌడ, ఆశికా రంగనాథ్, రుక్మిణీ వసంత్ తాజాగా తమ ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా, పబ్లిక్ ఈవెంట్స్ కి హాజరయ్యే హీరోయిన్స్ , నటీమణులను అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కథానాయికులు మండిపడుతున్నారు. జూమ్ చేసి మరీ తమ శరీరాలను ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు కూడా పంచుకుంటూ ఉండటంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఆకతాయిల ఆగడాలను అరికడతారా?
ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయని, అవకాశాలు రావాలి అంటే సినిమా నిర్మాతలు, దర్శకులు, హీరోలు చెప్పినట్టు చేయాలి అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మరొకవైపు ఇలా ప్రత్యేకించి కన్నడ బ్యూటీలు సినిమా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు లేదా బహిరంగ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు తమ శరీర భాగాలను జూమ్ చేసి మరి ఫోటోలు తీస్తున్నారంటూ వాపోడం హాట్ టాపిక్ మారింది. మరి ఈ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు, అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.
