ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సినీ నటుడు.. కారణం?
తన భార్య చీపురుతో, కట్టెలతో కొట్టడంతోనే ఆవేదనకు గురైన సిద్ధి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కూడా వెల్లడించారు.
By: Madhu Reddy | 11 Aug 2025 12:20 PM ISTసినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా పేరు సొంతం చేసుకున్న చంద్రశేఖర సిద్ధి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆమె వల్లే గత కొంతకాలంగా ఆయన నరకం అనుభవిస్తున్నారని, ఆమె చూపించే నరకం, చేసే అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే కన్నడ హాస్యనటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న చంద్రశేఖర సిద్ధి 31 సంవత్సరాల వయసులో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.. ముఖ్యంగా సిద్ధిని అతని భార్య చీపురుతో, కర్రతో కొట్టిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
తన భార్య చీపురుతో, కట్టెలతో కొట్టడంతోనే ఆవేదనకు గురైన సిద్ధి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ సిద్ధి భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకున్న భర్తను ఇలా చీపురుతో కొట్టి అవమానించడం ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అవమాన భారంతోనే 31 సంవత్సరాల వయసులోనే నటుడు సిద్ధి తనువు చాలించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సిద్ధి కెరియర్ విషయానికొస్తే.. 2020లో 'కామెడీ ఖిలాడిగలు' అనే షోతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.
ఇకపోతే సిద్ధి మరణంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సెలబ్రిటీలు, తోటి నటీనటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు.
