Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో కన్నడ భామ‌ల‌ ప్రయాణం!

దశాబ్దాలుగా కన్నడ భామలు తెలుగు తెరకు పరిచయమై అందచందాలు.. నటనతో స్టార్ హోదాను సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో తిరుగులేని ముద్ర వేశారు.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 2:00 PM IST
టాలీవుడ్‌లో కన్నడ భామ‌ల‌ ప్రయాణం!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిత్యం కొత్తద‌నానికి.. ఇతర భాషల నుంచి వచ్చే వైవిధ్యమైన ప్రతిభకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ముఖ్యంగా కన్నడ చిత్రసీమ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన నటీమణులు ఇక్కడ సాధించిన విజయం.. సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. దశాబ్దాలుగా కన్నడ భామలు తెలుగు తెరకు పరిచయమై అందచందాలు.. నటనతో స్టార్ హోదాను సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో తిరుగులేని ముద్ర వేశారు.

కన్నడ నాట జన్మించి టాలీవుడ్‌ను ఏలిన భామల్లో మొదటి వరుసలో నిలుస్తారు అనుష్క శెట్టి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `సూపర్` చిత్రంతో పరిచయమైన అనుష్క అటుపై `అరుంధతి`, `బాహుబలి` వంటి పాన్-ఇండియా చిత్రాలతో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. స్వీటీ బాటలోనే అడుగుపెట్టిన రష్మిక మందన `ఛలో`, `గీత గోవిందం` చిత్రాలతో నేషనల్ క్రష్‌గా మారింది. `పుష్ప` సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు.

అయితే అంద‌రికీ తక్షణమే స్టార్‌డమ్ ద‌క్క‌లేదు. పాన్-ఇండియా సంచలనం `కేజీఎఫ్` సిరీస్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో బిజీ కాలేదు. అలాగే `అమిగోస్`, `నా సామిరంగా` వంటి చిత్రాలలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్ కు మంచి నటిగా ప్రశంసలు అందుకున్నా? స్టార్ హీరోయిన్ రేంజ్ ఆఫర్లు దక్కించుకోవడానికి ఇంకా కష్టపడాల్సి వస్తోంది.

ప్రస్తుతం కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్న భామల్లో రుక్మిణి వసంత్ అగ్రస్థానంలో ఉన్నారు. `సప్త సాగరదాచే ఏల్లో` చిత్రంతో త‌న నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన భామ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.

ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో ఒక విజయం సాధిస్తే వరుసగా ఆఫర్లు క్యూ కట్టేవి. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో కాస్టింగ్ సమీకరణాలు.. కాంబినేషన్ క్రేజ్ .. కథల ఎంపిక విధానం పూర్తిగా మారిపోయాయి. గ్లామర్‌తో పాటు కథకు సరిపోయే విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటేనే సుదీర్ఘ కాలం నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. పోటీ పెరిగిన నేపథ్యంలో ప్రతి సినిమా కూడా ఓ కొత్త పరీక్షగానే మారుతోంది.

ఏది ఏమైనా? టాలీవుడ్‌లో కన్నడ భామల హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాబోయే పెద్ద సినిమాలలో నటిస్తున్న శ్రీనిధి శెట్టి, ఆషికా రంగనాథ్ , రుక్మిణి వసంత్ వంటి యంగ్ బ్యూటీస్ సరైన కమర్షియల్ హిట్ పడితే స్టార్ హీరోయిన్ల లీగ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పరిశ్రమలో మారుతున్న ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ భ‌విష్య‌త్ లో టాలీవుడ్‌లో ఎలాంటి విజయాలు నమోదు చేస్తారో చూడాలి.