Begin typing your search above and press return to search.

ఛాలెంజ్ లను ఫేస్ చేయాల్సిందే..

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బహిరంగంగా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   24 Dec 2025 12:00 AM IST
ఛాలెంజ్ లను ఫేస్ చేయాల్సిందే..
X

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బహిరంగంగా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. అటు ఇండస్ట్రీలోనే కాదు ఇక బయట అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయం వచ్చినప్పుడు వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలనాటి తార, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రేమ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను విడాకులు తీసుకోవడం వెనుక అసలు కారణాన్ని చెబుతూనే.. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అంటూ కొత్త వాళ్లకు సలహాలు కూడా ఇస్తోంది.

కన్నడ నటి అయిన ప్రేమ.. 1995లో కన్నడ సినీ రంగ ప్రవేశం చేసి సవ్యసాచి ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఆటా హుడుగటలో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఈమెకు విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్ కుమార్ తో కలిసి నటించిన మరో చిత్రం ఓం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించింది. పైగా ఇది బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. అలా కన్నడలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మలయాళంతో పాటు తెలుగులో కూడా అడుగుపెట్టి ఆకట్టుకుంది. తొలిసారి ధర్మచక్రం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే దేవి సినిమా మాత్రమే ఈమెకు మంచి విజయాన్ని అందించింది. తెలుగులో 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా హిందీలో కూడా డబ్ చేయబడింది. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. మధ్యలో ఎనిమిదేళ్లు సినిమాలకు విరామం ఇచ్చి.. 2017లో మళ్లీ ఉపేంద్ర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకున్న ఈమె.. కొంతకాలానికే విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. అలా 2006లో ప్రముఖ వ్యాపారవేత్త జీవన్ అప్పచుతో ఏడడుగులు వేసింది ప్రేమ. పదేళ్లపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు 2016లో విడాకులు తీసుకున్నారు..

ఇక విడాకుల విషయంపై ఇన్ని రోజులు స్పందించని ఈమె.. ఇటీవల వాటి గురించి మాట్లాడుతూ.." వృత్తి జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు.. నేనెప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాన్ని వృత్తి జీవితంలోకి తీసుకురాలేదు. దీనిపై ఎవరూ కూడా అడగలేదు. మాట్లాడలేదు కూడా.. ముఖ్యంగా విడాకుల గురించి నా తల్లిదండ్రులతో నేను చర్చించాను. వాళ్లు కూడా నీ ఇష్టప్రకారమే చేయు అని చెప్పారు. నా జీవితం నాకు ముఖ్యమనిపించింది.

అందుకే నచ్చిన విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. నిజానికి విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి నేను చెప్పేది ఇదే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకే నేను కూడా అలాంటి విషయాలు ఛాలెంజ్ గా తీసుకొని సూసైడ్ వరకు వెళ్లలేదు" అంటూ ప్రేమ తెలిపింది. మొత్తానికైతే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప సూసైడ్ లాంటివి చేసుకోకూడదు అంటూ తెలిపింది.

అలాగే ఆమె మాట్లాడుతూ.." ప్రపంచం చాలా పెద్దది. ఏదో ఒక పని చేస్తూ దాని నుంచి మనం డైవర్ట్ అవ్వచ్చు. నచ్చకపోతే ఇదే జీవితం కాదు కదా.. శక్తి, స్వేచ్ఛ అన్ని మనకు ఉన్నాయి. అందుకే ప్రతి కష్టాన్ని చాలెంజ్గా తీసుకోండి. అప్పుడే మీరు మరింత బలంగా తయారవుతారు" అంటూ సలహాలు కూడా ఇచ్చింది ప్రేమ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.