కన్నడ నటికి రియల్ ఎస్టేట్ వ్యాపారి అశ్లీల బెదిరింపులు.. అరెస్టు
పలు కన్నడ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ ను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెంగళూరు నగర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
By: Garuda Media | 16 Nov 2025 9:31 AM ISTపలు కన్నడ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ ను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెంగళూరు నగర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆమెతో కొంతకాలం రిలేషన్ లో ఉన్న ఈ వ్యాపారి.. తాజాగా అశ్లీల వేధింపులకు గురి చేయటంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..
పలు కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటికి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సుపరిచితమైన ఏవీఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డికి పరిచయం 2021 నుంచి ఉంది. మహారాజ బళ్లారి టస్కర్స్ క్రికెట్ జట్టుకు ఆయన నేత్రత్వం వహిస్తున్నారు. శ్రీలకంలో జరిగిన లార్స్ క్రికెట్ కప్ వేడుకల్ని ప్రారంభించేందుకు సదరు నటిని తనతో తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య రిలేషన్ పెరిగింది. అయితే.. అదే ఏడాది చివరి నుంచి ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని 2024లో చెప్పారని.. అతనితో పెళ్లి ఇష్టం లేని సదరు నటి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకొని సూసైడ్ అటెంప్టు చేసింది. ఆ సమయంలో అరవింద్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇటీవల కాలంలో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. తాజాగా అరవింద్ రెడ్డి శ్రీలంక నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. దీంతో.. అతడ్ని అరెస్టు చేసినట్లుగా బెంగళూరు నగర పోలీసులు ధ్రువీకరించారు.
