రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!
బాలీవుడ్‌లో మ్యాజికల్ వాయిస్‌తో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
By: Srikanth Kontham | 4 Nov 2026 1:32 PM ISTబాలీవుడ్‌లో మ్యాజికల్ వాయిస్‌తో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హథిరమణిని వివాహం చేసుకున్న కనిక పెళ్లైన నాలుగేళ్లకే విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సంగీత అభిమానుల్లో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 2022 మే 20న లండన్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కనికా కపూర్- గౌతమ్ హథిరమణుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
15 సంవత్సరాల పాటు మంచి స్నేహితులుగా ఉన్నజోడీ అటుపై ప్రేమలో పడ్డారు. కనికా స్వయంగా గౌతమ్‌ను రెండుసార్లు పెళ్లి చేసుకుందామని కోరడం.. ఆయన 2021లో ప్రపోజ్ చేయడం వంటి ఆసక్తికర విషయాలను కనిక గతంలో అభిమానులతో పంచుకున్నారు. ఈ వివాహ వేడుకలో కనికా ముగ్గురు పిల్లలు కూడా పాల్గొనడం విశేషం. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన ద్వారా భర్త గౌతమ్‌కు విడిపోతున్నట్లు కనికా కపూర్ వెల్లడించారు.
`ఎంతో ఆలోచించిన తర్వాత నా భర్త నేను వేర్వేరు దారుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మేమిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణానికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తారని.. దయతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను` అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కనికా కపూర్‌కు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. కనికా కపూర్ 18వ ఏట 1998లో మొదటి భర్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుని లండన్‌కు వెళ్లారు. వారికి ముగ్గురు పిల్లలు (కుమారుడు యుగ్‌రాజ్, కుమార్తెలు ఆయనా, సమరా) జన్మించారు.
అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2012లో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన కనికా కపూర్ అటుపై భారతదేశానికి తిరిగొచ్చి సింగింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టారు. తొలి వివాహం రద్దయిన చాలా కాలం తర్వాత గౌతమ్ తో ప్రేమలో పడ్డారు. అటుపై కొంత కాలానికి వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం కూడా వీడిపోయింది.
`రాగిణి ఎంఎంఎస్ 2` చిత్రంలోని `బేబీ డాల్` పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కనికా కపూర్ ఆ తర్వాత `చిట్టియాన్ కలయ్యాన్`, `దేశీ లుక్`, `లవ్లీ` వంటి ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా నిలిచారు. ప్లేబ్యాక్ సింగింగ్ మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ మ్యూజిక్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సంగీత రంగంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అభిమానులను.. శ్రేయోభిలాషులను బాధిస్తుంది. ప్రస్తుతం విడాకుల ప్రకటన బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
