2027 లో కంగన రనౌత్ వివాహం!
సంప్రదాయ కుటుంబ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని కంగనా గతంలో అనేక ఇంటర్వ్యూలలో బహిరంగంగానే వెల్లడించారు.
By: Srikanth Kontham | 22 July 2026 5:00 AM ISTబాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె త్వరలోనే ఓ ఇంటికి కోడలిగా అడుగు పెడుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే 2027లోనే కంగనా వివాహాం అట్టహాసంగా జరగనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరి పెళ్లి కొడుకు ఎవరు? ఏం చేస్తాడు? ప్రేమ వివాహమా? పెద్దలు చూసిన కుర్రాడా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సినిమా పరిశ్రమకు చెందిన ఏ వ్యక్తినీ కంగన పెళ్లాడే యోచనలో లేరని ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులతో వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడం కంటే సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉండే స్థిరమైన వ్యాపారవేత్త అయితే వ్యక్తిగత జీవితానికి భద్రత ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ సంబంధం కుదిరే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం కంగనా రనౌత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. పార్లమెంటు సభ్యురాలిగా తన నియోజకవర్గ బాధ్యతలతో పాటు ప్రజా సేవలో బిజీగా ఉన్నారు. మరోవైపు నటిగా కొన్ని ప్రాజెక్ట్‌లను కూడా బాలీవుడ్‌లో బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా తన వ్యక్తిగత జీవితం కోసం, వివాహం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తాజా కథనాలతో అర్దమవుతుంది.
సంప్రదాయ కుటుంబ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని కంగనా గతంలో అనేక ఇంటర్వ్యూలలో బహిరంగంగానే వెల్లడించారు. సరైన సమయం వచ్చినప్పుడు తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తాజాగా వినిపిస్తున్న పెళ్లి వార్తలు ఆమె గతంలో చెప్పిన మాటలకు అనుగుణంగానే ఉండటంతో ఈ ప్రచారంలో నిజం ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు కంగనా రనౌత్ గానీ.. ఆమె కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవన్నీ బాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాలు మాత్రమే. ఎప్పుడూ ఏదో వార్తలో నిలిచే కంగనా ఈసారి వివాహం గురించి వస్తోన్న తాజా అప్‌డేట్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెండితెరపై నటనతో, రాజకీయాల్లో దూకుడుతో సంచలనాలు సృష్టిస్తున్న కంగనా రనౌత్ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 2027లో నిజంగానే ఆమె పెళ్లి పీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా ?లేదా? అనేది చూడాలి. ఏది ఏమైనా? కంగన అభిమానులు మాత్రం శుభవార్త కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
