అలాంటి వారిని దగ్గరకు రానివ్వకండి..!
కంగనా తన తాజా పోస్ట్‌లో... మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలి అనుకున్నప్పుడు, మీకంటే తెలివి ఎక్కువ ఉన్న వారితో సహవాసం చేయండి, అప్పుడే మీరు జీవితంలో అప్‌గ్రేడ్ అవుతారు.
By: Ramesh Palla | 27 Feb 2026 8:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా మరింత బిజీగా ఉంది. సినిమాల విషయంలో గతంలో ఉన్నంత స్పీడ్ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం, మంచి కొటేషన్స్ ను పంచుకోవడం చేస్తుంది. అంతే కాకుండా పార్లమెంట్‌లో తాను మాట్లాడిన వీడియోలను కూడా కంగనా షేర్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్వతహాగానే ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ పార్లమెంట్‌లో సత్తా చాటుతోంది. ఆమె ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులను ఎండగడుతూ చేస్తున్న ఉపన్యాసాలు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కంగనా గురించి ప్రముఖంగా చర్చ జరగడానికి కారణం ఆమె చేసిన ఒక పోస్ట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సోషల్ మీడియాలో కంగనా..
కంగనా తన తాజా పోస్ట్‌లో... మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలి అనుకున్నప్పుడు, మీకంటే తెలివి ఎక్కువ ఉన్న వారితో సహవాసం చేయండి, అప్పుడే మీరు జీవితంలో అప్‌గ్రేడ్ అవుతారు. అలాంటి వారితో కాకుండా కింది స్థాయి వారితో మీరు సన్నిహితంగా ఉన్నట్లయితే జాంబీలు కనుక ఎలా అయితే కిందకు లాగుతాయో అలాగే మిమ్ములను వారు అలా కిందకు లాగుతారు అంటూ కంగనా వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అందుకోసం తమ స్థాయి వారితో స్నేహం అవసరం అనేది ఆమె అభిప్రాయం. ఈ విషయమై ఆమె అభిమానులు పాజిటివ్‌గా స్పందించారు. కొందరు మాత్రం ఎప్పటిలాగే విమర్శలు చేస్తూ కంగనాకు ఇలాంటి సూక్తులు సెట్ కావు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఎంపీగా కంగనా బిజీ బిజీ...
ఎంపీగా కంగనా రనౌత్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంను ఆమె అభిమానులు సమర్ధిస్తూ ఉంటే, కొందరు మాత్రం బాధ్యతగల పదవిలో ఉండి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కంగనా ను ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో విమర్శలు చేసే వారు ఉన్నారు. అయితే ఆ విమర్శలను గురించి తాను పెద్దగా పట్టించుకోను అంటూ కంగనా చెబుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తనకు తోచిన విషయాలను షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి కంగనా చేరువ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారు మంచి విషయాలు చెబితే మరింత మందికి చేరువ అవుతాయి. జీవితంలో విజయాన్ని సాధించాలని చూసే మంచి మార్గంలో వెళ్లాలి అని, మంచి వారితో స్నేహం చేయాలని కంగనా సూచించడం అభినందనీయం.
హీరోయిన్‌గా వరుస సినిమాలు...
ఇక హీరోయిన్‌గా కంగనా రనౌత్ సినిమాలను కాస్త తగ్గించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉంది కనుక పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లుగా ఆమె అభిమానులు చెబుతున్నారు. మరోసారి ఎంపీగా కంగనా గెలిస్తే సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కంగనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే సమయంలో ఇండస్ట్రీలో ఆమెకు చాలా మంది శత్రువులు ఉండేవారు, ఆమె ముక్కుసూటి తనం కారణంగా ఆమెను చాలా మంది టార్గెట్ చేసి విమర్శలు చేయడం, ఆమె వాటికి తీవ్రంగా స్పందించడం జరిగేది. ఇప్పుడు అవి కాస్త తగ్గాయని చెప్పాలి.
