ఆ హీరోయిన్ సినిమా అంతా సైలెంట్ గానే!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. `మణికర్ణిక` తర్వాత అమ్మడు విజయానికి దూరంగా జరిగింది.
By: Srikanth Kontham | 5 Nov 2025 12:02 PM ISTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. `మణికర్ణిక` తర్వాత అమ్మడు విజయానికి దూరంగా జరిగింది. ఆ తర్వాత నటించిన సినిమాలేవి ఆశించిన ఫలితావ్వలేదు. వాటిలో కొన్ని కమర్శియల్ చిత్రాలైతే కొన్ని ప్రయోగాల గానూ కనిపిస్తున్నాయి. `తలైవీ`, `ఎమెర్జెన్సీ` లాంటి చిత్రాలు వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కడంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. కానీ ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చాయి. `చంద్రముఖి-2` ,` తేజాస్` లాంటి చిత్రాలు కూడా ప్లాప్ బాట పట్టినవే.
దీంతో కంగన ఖాతాలో విజయం పడి ఆరేళ్లవుతుంది. ప్రస్తుతం ఎంపీగా కూడా ప్రజలకు సేవ చేస్తోన్న నేపథ్యంలో సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతుంది. ఆ మధ్య ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చి రెండేళ్ల అనంతరం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నట్లు కంగన మరో అప్ డేట్ ఇచ్చింది. తమిళ్, హిందీ రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనతో పాటు, మాధవన్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని కూడా విజయ్ తెరకెక్కించడం విశేషం.
`తలైవీ` తో ప్లాప్ ఇచ్చినా హిట్ ఇస్తాడనే నమ్మకంతో కంగన మరోసారి అవకాశం ఇచ్చింది. ఆర్. రవీంద్రన్ నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను కూ ఇదే ఏడాది రిలీజ్ చేయాలని కంగన ప్లాన్ చేసింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇలా ఇన్ని రకాల అప్డేట్స్ ఉన్నా? అసలు సినిమా మొదలైందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా. కంగన ఆ ప్రకటనలు చేసిన తర్వాత మళ్లీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అసలు ఈ సినిమా మొదలవ్వలేదని తాజాగా వెలుగులోకి వస్తుంది.
కంగన ప్రకటనలు అన్నీ అక్కడికే పరిమితమైనట్లు కనిపిస్తోంది. సినిమాకు సంబంధించి వికీలో కూడా ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఎలాంటి అప్ డేట్ లేకుండా కంగనా విదేశాల్లో సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తుందా? అన్న సందేహం లేకపోలేదు. అయితే కంగన ఏ పని చేసినా మార్కెట్ లో బోలెడంత హడావుడి కనిపిస్తుంది. ఆ పని చిన్నదైనా? పెద్దదైనా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది.
