Begin typing your search above and press return to search.

ఎంపీ మేడం మూవీ సీక్వెల్‌కి అంతా రెడీ..!

ఎంపీగా ఉన్న కారణంగా కంగనా రనౌత్‌ కమర్షియల్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది. అయితే తన మార్క్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేయాలని కంగనా భావిస్తోంది.

By:  Ramesh Palla   |   30 Aug 2025 1:00 PM IST
ఎంపీ మేడం మూవీ సీక్వెల్‌కి అంతా రెడీ..!
X

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్‌గా ఉంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత సినిమాల విషయంలో, ఇండస్ట్రీ వారి గురించి కంగనా మాట్లాడటం చాలా తక్కువ అయింది. అసలు ఆమె ఇండస్ట్రీలో కనిపించడమే లేదు. ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఎన్నికల్లో పోటీకి ముందు చేసిన ఎమర్జెన్సీ సినిమాను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆ సినిమా సమయంలో కాస్త హడావిడి ఉంటుందని అంతా భావించారు. కానీ కంగనా పెద్దగా రచ్చ చేయకుండానే, ఫైర్ బ్రాండ్‌ మార్క్‌ వ్యాఖ్యలు చేయకుండానే సినిమాను సైలెంట్‌గా విడుదల చేసింది. సినిమా షూటింగ్‌ సమయంలో చాలా వివాదాలను ఆ సినిమా ఎదుర్కొన్న విషయం తెల్సిందే. అందుకే విడుదల సమయంలో కాస్త రచ్చ ఉంటుందని అంతా అనుకున్నారు, కానీ అంతా ఆశించిన స్థాయిలో ఫైర్ పుట్టలేదు.

క్వీన్‌ సీక్వెల్‌ కోసం అంతా రెడీ

ఎంపీగా ఉన్న కారణంగా కంగనా రనౌత్‌ కమర్షియల్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది. అయితే తన మార్క్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేయాలని కంగనా భావిస్తోంది. అందుకోసం తన రెండు సినిమాల సీక్వెల్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కంగనా రనౌత్‌ ఇప్పటికే తన హిట్‌ మూవీ 'క్వీన్‌' సీక్వెల్‌ స్క్రిప్ట్‌ కి ఓకే చెప్పింది. ఇదే ఏడాది చివరి నుంచి సినిమాను పట్టాలెక్కించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ కంగనా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. క్వీన్‌ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో క్వీన్‌ 2 కి ప్రకటించినప్పటి నుంచే బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తను వెడ్స్ మను 3 సైతం రాబోతుంది

ఇటీవల ఒక బాలీవుడ్‌ మీడియా సంస్థతో కంగనా రనౌత్‌ మాట్లాడింది. చాలా కాలం తర్వాత కంగనా సినిమాలకు సంబంధించిన మీడియా సంస్థతో సినిమాల విషయాల గురించి మాట్లాడింది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ తాను క్వీన్‌ సినిమాను చాలా ప్రత్యేకంగా చూస్తాను. అందుకే ఆ సినిమా సీక్వెల్‌ అంటే ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నాను. అంతే కాకుండా నాకు కెరీర్‌ లో అత్యంత కీలకమైన సినిమాల్లో తను వెడ్స్ మను ఒకటి. కనుక ఆ ప్రాంచైజీలో ఎన్ని సినిమాలు చేసేందుకు అయినా నేను రెడీ గా ఉంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పటికే తను వెడ్స్ మను 2 వచ్చింది. కనుక వచ్చే ఏడాది లేదా భవిష్యత్తులో తను వెడ్స్ మను 3 వస్తుందనే విశ్వాసంను ఆమె వ్యక్తం చేసింది.

క్వీన్‌ 2 కోసం కంగనా రనౌత్‌

మొదట క్వీన్‌ సీక్వెల్‌ ను మొదలు పెట్టబోతున్నారని సమాచారం అందుతోంది. క్వీన్‌ 2 కి వికాస్‌ బహల్ దర్శకత్వం వహించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ క్వీన్ 2 కోసం తాను స్క్రిప్ట్‌ రెడీ చేసినట్లుగా ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు. ఆయన స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కావడంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా లొకేషన్స్‌ ఎంపిక పనిలో ఉన్నాడు. ఆ తర్వాత నటీ నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఉంటుంది అని సమాచారం అందుతోంది. కంగనా నుంచి 40 నుంచి 50 రోజుల డేట్లను వికాస్ బహల్‌ అడిగారని, అంతకు ముందే సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కంగనా ప్రస్తుతం ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ సమయం సినిమాలకు కేటాయించే పరిస్థితి ఉండదు. అందుకే తక్కువ సమయంలోనే క్వీన్ 2 పూర్తి చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే తను వెడ్స్ మను 3 విషయంలోనూ అదే వ్యూహంను అమలు చేసే అవకాశం ఉంది.