ప్లాప్ లు వచ్చినా హీరోయిన్ ఎక్కడా తగ్గలేదు!
బాలీవుడ్ లో దేశభక్తి నేపథ్యంగల సినిమాలు నిరంతరం రిలీజ్ అవుతూనే ఉంటాయి. రకరకాల బ్యాక్ డ్రాప్ లో సిని మాలు చేస్తుంటారు.
By: Srikanth Kontham | 7 Jan 2026 2:00 PM ISTబాలీవుడ్ లో దేశభక్తి నేపథ్యంగల సినిమాలు నిరంతరం రిలీజ్ అవుతూనే ఉంటాయి. రకరకాల బ్యాక్ డ్రాప్ లో సిని మాలు చేస్తుంటారు. వాటికి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వందల వేలకోట్లు సాధించిన సినిమాలెన్నో. ఈ మధ్యనే రిలీజ్ అయిన `ధురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. స్పై థ్రిల్లర్ లో ఈ సినిమా ఓ ట్రెండ్ ని సృష్టించింది. ఇందులో రణవీర్ సింగ్ స్పై రోల్ లో ఆకట్టుకుంటాడు. ఇంకా ముందుకళ్తే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, విక్కీ కౌశల్, టైగర్ ష్రాప్ లాంటి స్టార్లు దేశభక్తి నేపథ్యంలో చేసిన సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి.
కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాత్రం ఈ జానర్ లో ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. కంగన నటించి 'ధాకడ్', 'తేజస్' లాంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలించలేదు. ఈ రెండు సినిమాల కోసం కంగన ఎంతగానో శ్రమించింది. స్పై జానర్లో మొట్టి మొదటి లేడీ స్పై గా బాలీవుడ్ లో సత్తా చాటాలని చేసిన ప్రయత్నాలివి. కానీ పని తప్ప ఫలితం కనిపించలేదు. చివరిగా ఇందీరాగాంధీ బయోపిక్ తో మరోసారి దేశభక్తిని చాటుకోవాలనుకుంది. ఆ సినిమా కూడా నిరాశనే మిగి ల్చింది.
వెండితెరపై ప్రధాని పాత్రలో దేశ సమగ్రత కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. 19756 దేశంలోని అత్యవరస పరిస్థితి ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' నీరుగార్చింది. ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తో యుద్దం ప్రకటించడం? సిమ్లా ఒప్పందం? ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో తీసుకున్న నిర్ణయాలు? వంటి ప్రశ్నలను ఇందులో చర్చించారు. కానీ ఇవేవి ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. ఎంగేజింగ్ గా చెప్పడంలో కంగన వైఫల్యం చెందింది. దీంతో భారీ నష్టాలు తప్పలేదు. అయినా సరే కంగన మాత్రం ఎక్కడా నెరవలేదు.
హిట్ కొట్టే వరకూ ప్రయత్నం ఆపనంటూ పని చేస్తోంది. మరోసారి దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. `భారత భాగ్య విధాత` టైటిల్ తో మరో సినిమా చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ గురించి కంగన ఇంత వరకూ ఎక్కడా ప్రకటించలేదు. బాలీవుడ్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం తెరపైకి రాలేదు. కానీ సినిమా ఆన్ సెట్స్ లో ఉందని అధికారికంగా ప్రకటించింది. తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పైనే నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు తానే స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తోందా? లేక పాత్ర , నిర్మాణం వరకే పరిమితమవుతుందా? అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.
