Begin typing your search above and press return to search.

జెన్-జీపై కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!

కొందరు కంగ‌న‌ మాటలను సమర్థి స్తుండగా.. మరికొందరు మాత్రం బాధ్యతాయుతమైన సెలబ్రిటీ అయి ఉండి నిర్దిష్ట తరానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం సరికాదని విమర్శిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   22 Aug 2026 6:00 PM IST
జెన్-జీపై కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
X

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్త‌ల్లో హైలైట్ అవ్వ‌డం కొత్తేం కాదు. సోషల్ మీడియా వేదికగా మనసులోని మాటలను నిర్మొహ‌మాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్ప‌డం అమ్మ‌డి ప్రత్యేక‌త‌. తాజాగా మరోసారి యువతరంపై కంగ‌న‌ ఆసక్తికర వ్యాఖ్య‌లు చేసారు. ట్రెండ్‌లో ఉన్న జెన్-జీ తరంపై కంగ‌న‌ తీవ్ర విమర్శలు గుప్పించి తాను మాత్రం జెన్-ఆల్ఫా తరానికి చెందినదానిగా భావిస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ‌డు జెన్-జీ జనరేషన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

నేటి యువత ప్రవర్తనా తీరు, జీవన శైలి , ఆలోచనా విధానంపై కంగ‌న‌ తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేయడంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాను జెన్-జీ తరానికి పూర్తిగా విరుద్ధమని .. తన ఆలోచనలు, ట్రెండ్స్ అన్నీ మోడరన్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే తాను ఆ తరానికి చెందనని, సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే జెన్-ఆల్ఫా కేటగిరీకి చెందినదానిగా గుర్తింపు పొందుతానని చెప్పుకొచ్చారు. కాలంతో పాటు మారుతున్న ట్రెండ్స్‌ను ఇష్టపడతానని.. పాతకాలపు పద్ధతులకు కట్టుబడి ఉండాలని కోరుకోనని వెల్లడించారు.

కంగనా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కంగ‌న‌ మాటలను సమర్థి స్తుండగా.. మరికొందరు మాత్రం బాధ్యతాయుతమైన సెలబ్రిటీ అయి ఉండి నిర్దిష్ట తరానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం సరికాదని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో జెన్-జీ వర్సెస్ కంగనా అన్నట్లుగా ట్రెండ్ నడుస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌లో భాగంగా కంగ‌న‌

జెనీ జీ యువ‌త‌ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేసారో తెలిసిందే.

నేటి యువత తాము అనుభవిస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, డ్రగ్స్, బెట్టింగ్‌లు, జూదం, డార్క్ వెబ్ వంటి వ్యసనాలకు బానిసవుతూ తమ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారని విమర్శించారు. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని కొద్దిమంది వల్లే ఇలాంటి చెడు ధోరణులు పెరుగుతున్నాయని ఆరోపించారు.వీటిపై జెన్ జీ యువ‌త కంగ‌న పై అదే స్థాయిలో నిప్పులు చెరిగారు. జెన్ జీ యువ‌త అంటే కంగ‌న‌కు అంత చుల‌క‌న‌గా ఉందా? ప్ర‌భుత్వం లోపాల‌ను...వైఫ్యల్యాల‌ను ఎండ‌గ‌డితే? అధికారంలో ఉన్న ఎంపీ కంగ‌న‌కు జెన్ జీ మాట‌లు చేదుగా ఉన్నాయంటూ... మ్యాక‌ప్ వేసుకున్నంత సుల‌భంగా జీవిత‌ముండ‌ద‌ని చుర‌క‌లంటించారు.

ఆ విమ‌ర్శ‌లు గిట్ట‌ని కంగ‌న మ‌రోసారి త‌న‌ని తాను జెన్ ఆల్పాగా ప్ర‌క‌టించుకుని జెన్ జీ కి మ‌రింత టార్గెట్ అయ్యారు. మ‌రి ఈ ప్ర‌భావం కంగ‌న సినిమాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తోందో చూడాలి. కంగ‌న జెన్ జీ నిటార్గెట్ చేసిన త‌ర్వాత ఆమె న‌టించిన ఏ సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. సినిమా రిలీజ్ ఉంటే గ‌నుక జెన్ జీ కంగ‌న సినిమాల‌పై బ్యాన్ కంగ‌న అంశాన్ని తెర‌పైకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.