ఆ విషయంలో అమ్మ చాలా బాధపడింది
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, తన కంటే ముందుగా తన తల్లికి ఓ బాబు పుట్టి 10 రోజులకు చనిపోయాడని ఎమోషనల్ అయారు కంగనా.
By: Sravani Lakshmi Srungarapu | 16 Aug 2025 12:00 AM ISTకంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వల్లే ఆమెకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకున్న కంగనా రనౌత్, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఎప్పుడూ ఏదొక విషయంపై మాట్లాడుతూ వివాదాల్లో నిలిచే కంగనా ఇప్పుడు ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుని వార్తల్లో నిలిచారు.
అలాంటి లైఫ్ ఇష్టం లేకనే..
తన తండ్రి తనను తక్కువ చేసి మాట్లాడేవాడని, బాగా చదువుకుంటేనే మంచి ఫ్యామిలీ దొరుకుతుందని చెప్పేవాడని, చదువుకోకపోతే తనను మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయనని బెదిరించేవాడని, వాళ్లు చెప్పేది తన మంచి కోసమే అయినప్పటికీ తనకు అలాంటి లైఫ్ జీవించాలని లేదని, అందుకే నటిని అవాలనుకున్నప్పుడు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో 15 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి పారిపోయి, చిన్న చిన్న పనులు చేస్తూ ప్లాట్‌ఫామ్ పై నిద్రపోయి 19 ఏళ్ల వయసులో నటిగా ఫస్ట్ ఛాన్స్ ను అందుకున్నారు కంగనా.
ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, తన కంటే ముందుగా తన తల్లికి ఓ బాబు పుట్టి 10 రోజులకు చనిపోయాడని ఎమోషనల్ అయారు కంగనా. బొడ్డు తాడు కొంచెం ఎక్కువగా కట్ చేయడం వల్లే అతను చనిపోయాడని తన తల్లి చెప్తుండేదని, ఈ విషయంలో ఆమె చాలా బాధపడిందని చెప్పిన కంగనా, ఆ సంఘటన వల్ల తన నాన్నమ్మ తన తల్లిని మళ్లీ హాస్పిటల్ కు పంపలేదని తెలిపారు.
నానమ్మకు మూఢనమ్మకం ఎక్కువ
తన నానమ్మ తమ ఇంటి నుంచి ఎవరూ డెలివరీ కోసం హాస్పిటల్ కు వెళ్లే ప్రసక్తే లేదని కండిషన్ పెట్టిందని, దీంతో తన తల్లి ఇంట్లోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని, తన మేనత్త కూడా ఇంట్లోనే ఇద్దరు పిల్లల్ని కనిందని, హాస్పిటల్ కు వెళ్తే పిల్లలు చనిపోతారనే మూఢనమ్మకంతోనే తన నానమ్మ వారికి ఇంట్లోనే డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేసిందని కంగనా చెప్పుకొచ్చారు.
