90వ దశకం నాటి కంగన-కరిష్మ ఫ్యాషన్ జ్ఞాపకాలు!
సీనియర్ నటీమణుల నుంచి కంగన ఏ విధంగా స్ఫూర్తి పొందుతుందో? ఈ పోస్ట్ ద్వారా మరోసారి నిరూ పించుకున్నారు.
By: Srikanth Kontham | 23 Aug 2026 7:00 PM ISTబాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆసక్తికర పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. తాజాగా 90ల నాటి బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పై కంగన అభిమానాన్ని చాటుకున్నారు. తన బాల్యపు రోజులకు సంబంధించిన ఓ అరుదైన త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసి కరిష్మాను ఒరిజినల్ ఫ్యాషనిస్ట్ అని కొనియాడారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనా పంచుకున్న ఆ చిత్రంలో ఆమె వేసుకున్న దుస్తులు పూర్తిగా 90ల నాటి స్టైల్‌ను తలపిస్తున్నాయి. పసుపు రంగు టీ-షర్ట్ ధరించి మ్యాచింగ్ నలుపు రంగు డంగరీస్ ధరించారు.
నడుము చుట్టూ క్యాజువల్‌గా స్వెట్‌షర్ట్ కట్టుకుని కనిపిస్తున్నారు. అప్పట్లో కరిష్మా కపూర్ సినిమాల్లో చేసిన డిఫరెంట్ స్టైలిష్ పాత్రల స్పూర్తితోనే తాను ఆ రకమైన గెటప్‌ను వేసుకున్నట్లు కంగన పరోక్షంగా వెల్లడించారు.90వ దశకంలో కరిష్మా కపూర్ (లోలో) నటనతో పాటు తనదైన ఫ్యాషన్‌తో యువతను ఎంతగానో ఆకట్టుకున్నారని కంగనా గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ కరిష్మా శైలిని అనుసరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
`90వ దశకంలో ఒరిజినల్ ఫ్యాషనిస్ట్ అయిన కరిష్మా కపూర్‌ను ఎవరెవరు పూజించారు? నేనైతే కచ్చితంగా ఆరాధించాను` అంటూ ఓ నోట్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు మరింత జోష్ తెస్తూ కంగనా ప్రఖ్యాత చిత్రం `దిల్ తో పాగల్హై` సినిమాలోని సూపర్‌హిట్ పాట `లే గయీ` సాంగ్‌ను కూడా జతచేశారు. కరిష్మా ధరించిన కాస్ట్యూమ్స్ .. ఆమె హావభావాలు తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని భావనను వ్యక్తం చేశారు. నిత్యం వివాదాలు..సమకాలీన సామాజిక అంశాలతో హైలైట్ అయ్యే కంగన ఒక్కసారిగా కరష్మా కపూర్ ను ఉద్దేశించి మాట్లాడటం.. 90ల సినిమా వైభవాన్ని నెమరు వేసుకోవడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సీనియర్ నటీమణుల నుంచి కంగన ఏ విధంగా స్ఫూర్తి పొందుతుందో? ఈ పోస్ట్ ద్వారా మరోసారి నిరూ పించుకున్నారు. ఈ త్రోబ్యాక్ పిక్ .. కరిష్మా కపూర్ పై ఆమె చూపిన అభిమానం నెట్టింట వైరల్‌గా మారింది. 90ల నాటి బాలీవుడ్ అందాలు ..జ్ఞాపకాలు నేటి తరానికి కూడా ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నాయని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది.
ఇక కంగన సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే అమ్మడు `భారత భాగ్య విధాత`లో నటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ అవుతుంది. అలాగే `సర్కిల్`..`క్వీన్ 2` లోనూ నటిస్తున్నారు. ఈ రెండు మినహా కొత్త ప్రాజెక్టులు ఏవీ కమిట్ అవ్వలేదు. మరోవైపు ఎంపీగాను బిజీగా ఉండటంతో సినిమాలపై మునుపటిలా దృష్టి సారించడం లేదు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ లోనూ కథళు ఎంచుకుంటున్నారు.
