తాళ పత్ర గ్రంధాల్లో చెప్పిందే ఆమె జీవితంలో!
బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలని...రాణించాలని అనుకునే వారందరికీ కంగన జీవితం స్పూర్తి దాయకంగా నిలుస్తుంది.
By: Srikanth Kontham | 13 Aug 2025 5:00 AM ISTకంగనా రనౌత్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చింది. నటి నుంచి రాజకీయాల్లో ఎంపీ వరకూ ఎదిగింది.`గ్యాంగ్ స్టర్` తో మొదలైన కంగన బాలీవుడ్ ప్రస్తానం నేటికి దిగ్విజయంగా కొనసాగుతోంది. లేడీ ఓరియేంటెడ్ నాయికగానూ ఎదిగింది. బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటే చిత్రాలెన్నో చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా రాణించడం అంటే చిన్న విషయం కాదు. ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. అడుగడుగునా అవమానాలు..హేళలను చూసింది.
కంగన వ్యతరేక వర్గం బాలీవుడ్ లో అమ్మడిపై పెద్ద రాజకీయమే చేసింది. ఎదుగుతోన్న కంగనను కిందకు తొక్కాలని కొన్ని శక్తిలు పని చేసాయి. వాటికి సైతం కంగన ఎదురెళ్లి నిలబడింది. కంగన కెరీర్ లో ఇలాంటి సవాళ్లు ఎన్నో. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బడా బాబుల్నే ఢీ కొట్టింది. నువ్వెంత ? అంటే నువ్వెంత అని సవాల్ విసిరింది. కంగన లో ఆ డేరింగ్ చూసే బీజేపీ ప్రోత్సహించడంతో గత ఎన్నికల్లో గెలిచి ఎంపీగా సేవలందిస్తుంది.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలని...రాణించాలని అనుకునే వారందరికీ కంగన జీవితం స్పూర్తి దాయకంగా నిలుస్తుంది. ఇదంతా పక్కన బెడితే కంగన జీవితం ఇలా ఉంటుందిని కంగనకు ముందే తెలు సు? అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిన సన్నివేశం ఇది. చిత్ర పరిశ్రమలోకి వెళ్తే కంగన జీవితం గొప్పగా ఉంటుందని తమిళనాడు లోని కొంత మంది సాధువులు తాళ పత్ర గ్రంధాలు చూసి ముందే చెప్పారుట. గొప్ప జాతకంలో కంగన పుట్టిందని జయలలితలా చిత్ర పరిశ్రమతో పాటు రాజకీ యాల్లోనూ రాణిస్తుందని జోస్యం చెప్పారుట.
అన్నట్లు గానే జరిగింది కదా? ఈ విషయాన్ని కంగన ప్రభాస్ కు `ఏక్ నిరంజన్` షూటింగ్ సమయంలో చెప్పిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. కెరీర్ ఆరంభంలో కంగన ప్రభాస్ హీరోగా నటించిన `ఏక్ నిరంజన్` లో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని పూర్తి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలోనూ పూరి కంగనలో రెబలిజాన్ని చూపించారు.
