Begin typing your search above and press return to search.

5 ల‌క్ష‌ల‌కు ఏ.ఆర్ రెహ్మాన్ క్రియేటివిటీని కొన్నాడు?!

అయితే రెహ‌మాన్ అలా చెక్కు ఇచ్చి పంప‌డానికి కార‌ణం కూడా ఆర్జీవీ చెప్పారు. సినిమా ట్యూన్స్ రెడీ చేయ‌డంలో ఆల‌స్యం చేసినందుకు సుభాష్ ఘయ్ తీవ్ర అసహనానికి గురై రెహ‌మాన్ పై విరచుకుపడ్డారు.

By:  Sivaji Kontham   |   21 Jan 2026 9:53 AM IST
5 ల‌క్ష‌ల‌కు ఏ.ఆర్ రెహ్మాన్ క్రియేటివిటీని కొన్నాడు?!
X

బాలీవుడ్ లో `ప‌వ‌ర్ షిఫ్ట్` త‌న‌కు స‌మ‌స్య‌లు క్రియేట్ చేసింద‌ని, త‌న `మ‌తం` కార‌ణంగా ఎనిమిదేళ్లుగా అవ‌కాశాలు కోల్పోతున్నాన‌ని ఏ.ఆర్.రెహ‌మాన్ వ్యాఖ్యానించిన త‌ర్వాత దానిపై విస్త్ర‌త‌మైన డిబేట్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. చాలా మంది సెల‌బ్రిటీలు, రెహ‌మాన్ స‌హ‌చ‌రులు కూడా ఈ అంశంపై ఓపెన్ గా మాట్లాడారు. శంక‌ర మ‌హ‌దేవ‌న్ లాంటి ప్ర‌ముఖులు రెహ‌మాన్ కి మ‌ద్ధ‌తుగా `ప‌వ‌ర్ షిఫ్ట్` అనేది బాలీవుడ్ లో ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం కూడా ఆస‌క్తిని రేకెత్తించింది.

అయితే క్వీన్ కంగ‌న ర‌నౌత్ మాత్రం రెహ‌మాన్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ, అత‌డు `ప్రొప‌గండా` పేరుతో త‌న ఎమ‌ర్జెన్సీ సినిమాని తిర‌స్క‌రించాడ‌ని, క‌నీసం త‌న‌ను క‌లిసేందుకు కూడా అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని ఆరోపించారు. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన దాని ప్రకారం, సుభాష్ ఘయ్ దర్శకత్వంలో వచ్చిన `యువరాజ్` సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ఒక పాటను కంపోజ్ చేయమని సుఖ్వీందర్ సింగ్‌ను అడిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెహమాన్ తన మేనేజర్ ద్వారా సుఖ్వీందర్ సింగ్‌కు 5 లక్షల రూపాయల చెక్కును పంపారు.

అయితే రెహ‌మాన్ అలా చెక్కు ఇచ్చి పంప‌డానికి కార‌ణం కూడా ఆర్జీవీ చెప్పారు. సినిమా ట్యూన్స్ రెడీ చేయ‌డంలో ఆల‌స్యం చేసినందుకు సుభాష్ ఘయ్ తీవ్ర అసహనానికి గురై రెహ‌మాన్ పై విరచుకుపడ్డారు. ఆ స‌మ‌యంలో రెహమాన్ తన స్నేహితుడైన సుఖ్వీందర్ సింగ్ స్టూడియోకు వెళ్లి ఒక ట్యూన్ సిద్ధం చేయమని కోరారు. సుఖ్వీందర్ ఒక ట్యూన్ కంపోజ్ చేశారు. కానీ ఆ ట్యూన్ విన్న సుభాష్ ఘయ్ అది తన సినిమా స్థాయికి సరిపోదని భావించి రిజెక్ట్ చేశారు.

అయితే అలా ఆయ‌న వ‌ద్ద రిజెక్ట్ అయిన ట్యూన్‌నే ఏఆర్ రెహమాన్ తర్వాత `స్లమ్‌డాగ్ మిలియనీర్` సినిమా కోసం `జై హో` పాటగా మార్చారు. ఆ పాట ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంగీత ప్రియుల‌ను అల‌రిస్తూనే ఉంది. అయితే ఆ పాట‌ను కంపోజ్ చేసినందుకు సుఖ్వింద‌ర్ కి వ‌ర్మ 5ల‌క్ష‌లు అంద‌జేసారు. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి, ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ పాటను వేరే సినిమాకు అమ్మినందుకు, దాని సక్సెస్‌లో భాగస్వామిగా ఉన్నందుకు రెహమాన్ తన వంతు వాటాగా సుఖ్వీందర్ సింగ్‌కు ఆ 5 లక్షల రూపాయలను పంపారు.

అయితే ఈ విషయంపై సుఖ్వీందర్ సింగ్ ని ప్ర‌శ్నంచిన‌ప్పుడు అత‌డు స్పందిస్తూ.. తాను కేవలం ఆ పాటను పాడానని, కంపోజ్ చేయలేదని.. రామ్ గోపాల్ వర్మకు ఏదో తప్పుడు సమాచారం అంది ఉండవచ్చని క్లారిటీ ఇచ్చారు. లెజెండ‌రీ సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్.రెహ‌మాన్ వంద‌లాది పాట‌ల‌కు చార్ట్ బ‌స్ట‌ర్ ట్యూన్స్ అందించారు. అవార్డులు రివార్డుల‌కు కొద‌వేమీ లేదు. ఆయ‌నకు క్రియేటివిటీని కొనుక్కోవాల్సిన అవ‌స‌రం ఉందా? మీ అభిప్రాయం ఏమిటి?