రాజకీయాలా? సినిమాలా? కంగనా ఆన్సర్ ఏంటంటే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఉంటూ ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ ఏదొక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 4:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఉంటూ ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ ఏదొక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కంగనా రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే కంగనా చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారతాయి.
ఒకటి సెలెక్ట్ చేసుకోలేను
కాగా కంగనా తాజాగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ చాట్ సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కంగనాకు ఆమె ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. చాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ మీకు పాలిటిక్స్ ఇష్టమా? సినిమాలు ఇష్టమా అని అడగ్గా, ఆ రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోలేనని, ప్రస్తుతం రెండూ తనకు సమాన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని చెప్పారు.
అభిరుచులు మారుతూ ఉంటాయి
కాలంతో పాటూ మన అభిరుచులు కూడా మారుతాయని, ప్రస్తుతం తన దృష్టి క్రియేటివ్ మరియు పాలిటిక్స్ పై ఉందని, మనిషి లైఫ్ లో ఓ విషయంలో మాత్రమే నచ్చాల్సిన పన్లేదని, ప్రతీ దాంట్లో నేర్చుకునే విషయముంటుందని, తనకు రాజకీయాలూ, సినిమాలూ రెండూ ఇష్టమేనని చాలా క్లియర్ గా చెప్పారు. మరొకర నెటిజన్ నెక్ట్స్ మూవీ గురించి అడగ్గా దానికి సమాధానమిచ్చారు కంగనా.
నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కంగనా క్లారిటీ
ప్రస్తుతం ఓ కథపై వర్క్ జరుగుతుందని చెప్పిన కంగనా, నెక్ట్స్ ఇయర్ లో ఆ మూవీ షూటింగ్ మొదలవనుందని చెప్పారు. అయితే ఆ సినిమాలో కంగనా నటిస్తున్నారా లేకా ఆ సినిమా కంగనా దర్శకత్వంలో వస్తుందా అనే విషయంలో మాత్రం కంగనా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఓ ప్రాజెక్టుపై మాత్రం తాను వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి చాలా కాలంగా వస్తున్న రూమర్లపై కూడా ఆమె స్పందించారు. తన పెళ్లి గురించి ఎన్నో వార్తలు విన్నానని, కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదని, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడంపై తనకు ఇంట్రెస్ట్ లేదని, అలాంటి విషయాలు తనకు సూట్ అవవని క్లారిటీ ఇచ్చారు.
