Begin typing your search above and press return to search.

మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ.. గమనించారా?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు.. ఒక్కొక్కరిగా ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   12 Oct 2025 11:00 PM IST
మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ.. గమనించారా?
X

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు.. ఒక్కొక్కరిగా ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భామలు జెనీలియా, లయ, అనిత, అన్షు.. సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ కామ్నా జెఠ్మలానీ పదేళ్ల తర్వాత సందడి చేయనున్నారు. సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చిన వారి లిస్ట్ లో చేరనున్నారు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు కే- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అందులో కామ్నా జెఠ్మలానీ కనిపిస్తారు. ట్రైలర్ లో సీనియర్ నటుడు నరేష్.. ఒకరి వెనుక పడుతున్నట్లు కనిపిస్తారు. ఆమెనే కామ్నా. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అయితే సినిమాలో కామ్నా ఏ క్యారెక్టర్ లో కనిపించనున్నారో.. ఎంతసేపు కనిపించనున్నారో క్లారిటీ లేదు. అక్టోబర్ 17వ తేదీన తెలుస్తోంది. అదే సమయంలో రెండేళ్ల క్రితం.. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ వ్యవస్థలో కామ్నా కనిపించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు సినిమాల విషయంలో మాత్రం కే- ర్యాంప్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

కామ్నా జెఠ్మలానీ కెరీర్ విషయానికొస్తే, ప్రేమికులు మూవీతో హీరోయిన్ గా యాక్టింగ్ ను స్టార్ట్ చేసింది. ఆ వెంటనే ఇదయా తిరుడన్ మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన కామ్నాకు.. టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా వచ్చిన రణంతో సూపర్ హిట్ దక్కింది. తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకున్న ఆమె.. అందరినీ మెప్పించింది.

అయితే పెళ్లి, పిల్లలు తర్వాత కామ్నా జెఠ్మలానీ.. కెరీర్ కు బ్రేక్ ఇచ్చారు. చివరగా తెలుగు - కన్నడ ద్విభాషా సినిమా చంద్రికలో కనిపించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. క్యామియో రోల్ లో కనిపించలేదు. ఇప్పుడు కే- ర్యాంప్ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన కే- ర్యాంప్ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌లపై రాజేశ్ దండ, శివ బొమ్మక నిర్మిస్తున్నారు. మరి సినిమాలో కామ్నా జెఠ్మలానీ ఏ రోల్ లో కనిపిస్తారో.. ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.