Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో హీరో పేర్ల‌పై న‌టుడి హాట్ కామెంట్స్‌!

ఇండియాపై ఇండియ‌న్ పొలిటీష‌య‌న్స్ చేస్తున్న కుట్ర‌ల‌కు చెలించిపోయిన అజ‌య్ స‌న్యాల్ దీనిపై `ధురంధ‌ర్‌`లో ఓ డైలాగ్ చెబుతాడు.

By:  Ravindar Gorantla   |   9 April 2026 4:00 PM IST
ఇండస్ట్రీలో హీరో పేర్ల‌పై న‌టుడి హాట్ కామెంట్స్‌!
X

ఇండియాపై ఇండియ‌న్ పొలిటీష‌య‌న్స్ చేస్తున్న కుట్ర‌ల‌కు చెలించిపోయిన అజ‌య్ స‌న్యాల్ దీనిపై `ధురంధ‌ర్‌`లో ఓ డైలాగ్ చెబుతాడు. `హిందుస్థానియోంకా స‌బ్‌సే బ‌డా దుష్మ‌న్ హిందుస్థానీ హై పాకిస్థాన్‌తో దూస్రా నంబ‌ర్‌ప‌ర్ ఆతీహై.. ` భార‌తీయుల‌కు అతి పెద్ద శ‌త్రువు భార‌తీయుడే..పాకిస్థాన్ ఆ త‌రువాత స్థానంలో ఉంటుంద‌ని..ఇక్క‌డ కొంత మంది మాట‌లు వింటే అదే నిజ‌మ‌నిపిస్తోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని నెల‌లుగా సెల‌బ్రిటీలు మైక్ ప‌ట్టుకుంటే చాలు కాంట్ర‌వ‌ర్సీలు మాట్లాడేస్తూ వైర‌ల్ అయిపోతున్నారు.

ఆ త‌రువాత నెటిజ‌న్‌లు, కోర్టులు చీవాట్లు పెట్ట‌డంతో సైలెంట్ అయిపోయి త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. తాజాగా ఓ న‌టుడు ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చేసి నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు త‌ననే క‌మ‌ల్ కామ‌రాజు. ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి రూపొందించిన `అనుకోకుండా ఒక రోజు` సినిమాతో న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన క‌మ‌ల్ కామ‌రాజు ..జ‌క్క‌న్న - ప్ర‌భాస్‌ల `ఛ‌త్ర‌ప‌తి`, శేఖ‌ర్ క‌మ్ముల - సుమంత్‌ల `గోదావ‌రి` సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

అనీష్ కురువిల్ల ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన `ఆవ‌కాయ బిర్యాని` సినిమాతో హీరోగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌క‌పోవ‌డంతో అప్ప‌టి నుంచి హీరో ఫ్రెండ్‌, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు చేస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మూవీలో క‌మ‌ల్ అనే ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. తాజాగా ఓ పోడ్ కాస్ట్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ కామ‌రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌కి మ‌స్లీం పేర్లు ఎందుకు పెట్టరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

త‌మిళ‌, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల్లో హీరో క్యారెక్ట‌ర్ల పేర్లు ముస్లిం పేర్లు ఎందుకు పెడ‌తారు? తెలుగులో మాత్రం ఎందుకుండ‌వు. తెలుగులో ఎవ‌రూ పెట్టుకోరు. ఏ రామో గీమో పెట్టుకుంటారు. ఎందుకంటే అవ‌గాహ‌న శ‌క్తి ఇంతే ఉంది కదా? ఇంత‌లోనే సినిమాతీసి ఇలా ఊపితే సౌండ్ వ‌స్తుంది...సౌండ్ వస్తుంది క‌దా చాలు నాకు అనుకుంటున్నాడు. అలా కాకుండా వేరేలా చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది క‌దా అంటే ఇదే బాగుంది బ్రో అంటూ కొట్టిందే కొడుతున్నారు. ఆ రోతే కొడుతున్నారు..అలా కాకుండా వేరేలా చేస్తే చూడ‌రేమో అనే భ‌యం` అంటూ ఓ పోడ్ కాస్ట్ ఇంట‌ర్వ్యూలో న‌టుడు క‌మ‌ల్ కామ‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. `ఆవ‌కాయ్ బిర్యాని`లో క‌మ‌ల్ కామ‌రాజు హీరోగా న‌టించాడు. హీరోగా అదే ఫ‌స్ట్ మూవీ..ఇందులో అత‌ని క్యారెక్ట‌ర్ పేరు అక్బ‌ర్ క‌లామ్‌. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింద‌నే ట్రాన్స్‌లో ఉన్నావ‌ని, అలాగే అంద‌రూ హీరో పేరు పెట్టాల‌ని భావిస్తున్నావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. `ఆర్ఆర్ ఆర్‌`లో జూనియ‌ర్ ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ పేరేంటీ? ..అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` మూవీలో నారా రోహిత్ క్యారెక్ట‌ర్ పేరేంటీ?..ఖ‌డ్గంలో ప్ర‌కాష్ రాజ్ పేరేంటీ? ..ఇంత‌కీ నీకు ఏమైంది.....రా` అంటూ నెటిజ‌న్‌లు ఫైర్ అవుతున్నారు.