KH237: కమల్ హాసన్ భారీ యాక్షన్ సినిమా
అయితే ఇప్పుడు ఒక జాతీయ అవార్డు గ్రహీత అయిన కమల్ హాసన్ తో మరో జాతీయ అవార్డ్ గ్రహీత అయిన, స్క్రీన్ రైటర్ శ్యామ్ పుష్కరన్ కలిసి పని చేస్తున్నారు.
By: Sivaji Kontham | 13 Sept 2025 9:22 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ తో కలిసి పని చేయడం అంటే అది ఒక గొప్ప అఛీవ్ మెంట్. అయితే ఇప్పుడు ఒక జాతీయ అవార్డు గ్రహీత అయిన కమల్ హాసన్ తో మరో జాతీయ అవార్డ్ గ్రహీత అయిన, స్క్రీన్ రైటర్ శ్యామ్ పుష్కరన్ కలిసి పని చేస్తున్నారు. ఆయన KH 237 చిత్రీకరణలో చేరుతున్నారని చిత్రబృందం ప్రకటించింది. అన్బరివ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కవల స్టంట్ కొరియోగ్రాఫర్లు తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారని ప్రకటన
కమల్ హాసన్ తో శ్యామ్ పుష్కరన్, అన్బరివ్ కూడా ఉన్న ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. విక్రమ్, థగ్ లైఫ్, కూలీ వంటి భారీ చిత్రాలకు అసాధారణమైన ఫైట్స్ ని అందించిన కవల సోదరులు అన్బరివ్- పుష్కరన్ ఇప్పుడు కమల్ హాసన్ కోసం సృజనాత్మక యాక్షన్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ జోడీ డైనమిక్ స్టంట్ సన్నివేశాలు ప్రత్యేకతను ఆపాదిస్తాయని నమ్ముతున్నారు. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ పూర్తి కొత్త లుక్‌ను ప్రదర్శిస్తారు. ఆర్ మహేంద్రన్‌తో కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కళ్యాణి తొలిసారిగా కమల్ హాసన్‌తో కలిసి పనిచేయనుంది.
శ్యామ్ పుష్కరన్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్.. రచయిత. దిలీష్ నాయర్‌తో కలిసి రాసిన `సాల్ట్ ఎన్ పెప్పర్` తొలి ప్రయత్నం. 22 ఫిమేల్ కొట్టాయం, మహేశింటే ప్రతీకారం, మాయానది, కుంబళంగి నైట్స్ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాశారు. తొండిముత్యాలు దృక్సాక్షియుమ్ (2017) చిత్రానికి సహ-దర్శకత్వం వహించాడు.. సంభాషణలు రాసాడు. శ్యామ్ పుష్కరన్ 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల (2016)లో మహేశింటే ప్రతీకారం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లేగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు.
