కమల్ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నం!
రజనీకాంత్ వయసు 74 ఏళ్లు. అయినా ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. సెట్ లోకి వచ్చారంటే ఫైటింగ్ లు ఇరగదీస్తారు.
By: Srikanth Kontham | 3 Dec 2025 6:00 AM ISTరజనీకాంత్ వయసు 74 ఏళ్లు. అయినా ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. సెట్ లోకి వచ్చారంటే ఫైటింగ్ లు ఇరగదీస్తారు. చిరంజీవి వయసు 70 ఏళ్లు. అయినా? అన్నయ్య రింగ్ లోకి దిగనంత వరకే. దిగారంటే? పంచ్ పవర్ తట్టుకోవడం అంత వీజీ కాదు. ఇప్పటికే అదే గ్రేస్ తో పని చేస్తున్నారు. మోహన్ బాబు వయసు కూడా 74 ఏళ్లే. అయినా ఆయన డైలాగ్ చెప్పారంటే? అది పేలాల్సిందే. వీరంతా ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వీళ్లందర్నీ మించి యాక్టివ్ గా పని చేస్తుంది? యాక్టివ్ గా ఉంది ఎవరంటే విశ్వనటుడు కమల్ హాసన్ పేరు చెబుతారంతా.
ప్లాప్ అయితే అదే ఆలోచన:
కమల్ వయసు 71. అంటే రజనీకాంత్..మోహన్ బాలు కంటే మూడేళ్లు చిన్నవారే. అయినా సరే కమల్ హాసన్ నోట రిటైర్మెంట్ మాట రావడం ఆశ్చర్యకరం. మరి ఆయన నోట ఈ మాట ఎందుకొచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తనని రిటైర్ అవ్వమని ఎవరూ అడగం లేదన్నారు. కానీ కొన్నిసార్లు తనకు తానే సినిమాలు ఆపేస్తే బాగుండు అనిపిస్తుందన్నారు. తాను నటించిన సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయిన సందర్భంలో రిటైర్మెంట్ ఆలోచన వస్తుందన్నారు. ఇంత కాలం పనిచేసాం. ఇంకెంత కాలం చేస్తాం. తప్పుకుంటే మంచిదని చాలా బలంగా అనుకుంటారుట.
వారి కోసమే ఆగుతున్నారా?
కానీ అభిమానులు, సన్నిహితులు మాత్రం సినిమాలు ఆపొద్దని సూచిస్తారన్నారు. మరి కొంత మంది మంచి సినిమాలు తీసి రిటైర్ అవ్వండని చెబుతుంటారన్నారు. తాను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కమల్ మాటల్ని బట్టి చూస్తే ఆయన సినిమాల్లో నటుడిగా ఇంకెంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదు. మరి కమల్ తో దర్శకుడిగా పనిచేసే అవకాశం ఎవరికి వస్తుందో? కమల్ నటుడిగా మానేసినా నిర్మాతగా పనిచేసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన నిర్మాతగానే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.
అన్ని శాఖల్లోనూ ఆరితేరారు:
బాల నటుడిగా కమల్ సినీ ప్రస్తానం మొదలైన సంగతి తెలిసిందే. 1960 లో `కలాతూర్ కన్నమ్మ` చిత్రంలో బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత హీరోగా ఇతర స్టార్లతో కలిసి పనిచేయడం..సోలోగా చిత్రాలు చేయడం మొదలు పెట్టారు. అలా 65 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అనతి కాలంలోనే విశ్వ నటుడిగా ఎదిగారు. దర్శకుడిగానూ పని చేసారు. గాయకుడిగా , రైటర్ గా, నేరేటర్ గా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఎన్నో అవార్డులు..రివార్డులు కమల్ ఏనాడో సాధించేసారు.
