Begin typing your search above and press return to search.

రజనీకాంత్ కమల్.. ఇది ఊహించని ట్విస్ట్

ఇండియన్ సినిమాలో కొన్ని కాంబినేషన్లు ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి ఒక అరుదైన, చారిత్రాత్మకమైన కాంబినేషన్ కు ఇప్పుడు రంగం సిద్ధమైంది.

By:  M Prashanth   |   5 Nov 2025 9:51 PM IST
రజనీకాంత్ కమల్.. ఇది ఊహించని ట్విస్ట్
X

ఇండియన్ సినిమాలో కొన్ని కాంబినేషన్లు ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి ఒక అరుదైన, చారిత్రాత్మకమైన కాంబినేషన్ కు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇండియన్ సినిమాకు గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు, సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్, మళ్లీ ఒకే సినిమా కోసం చేతులు కలిపారు.




అయితే, ఈసారి నటులుగా కాదు, ఒకరు హీరోగా, మరొకరు నిర్మాతగా. అసలైతే మొదట వీరి కలయికలో ఒక మల్టీస్టారర్ సినిమా వస్తుందని ఇదివరకే టాక్ వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ అని కూడా కథనాలు వచ్చాయి. కానీ అ విషయంలో క్లారిటీ రాకముందే ఈ ట్విస్ట్ ఇచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదొక ల్యాండ్‌మార్క్ కొలాబరేషన్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుందర్ సి. దర్శకత్వం వహించనున్నారు. రజినీకాంత్, సుందర్ సి. కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు 'అరుణాచలం' లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్ గుర్తొస్తుంది. సుమారు 28 ఏళ్ల తర్వాత, ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఎంటర్‌టైనర్లలో ఒకటిగా నిలుస్తుందని టాక్.

ఈ ప్రాజెక్ట్ గురించి కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. తన మిత్రుడి నిర్మాణంలో పనిచేయడం రజినీకాంత్‌కు ఆనందంగా ఉంటే, రజినీ సినిమాను నిర్మిస్తుండటం కమల్ హాసన్‌కు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చారిత్రాత్మక చిత్రాన్ని ప్రకటించడం మరో విశేషం.

ఈ సినిమాలో రజినీకాంత్ కామెడీ టైమింగ్‌ను ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో, సుందర్ సి. అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 పొంగల్ కానుకగా రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఏదేమైనా రజినీకాంత్ మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, కమల్ హాసన్ ప్రొడక్షన్ వాల్యూస్, సుందర్ సి. మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఈ మూడు క్లిక్కయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఇక మిగతా తారాగణం టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.