Begin typing your search above and press return to search.

తలైవా, కమల్ మధ్య కుర్ర డైరెక్టర్ కసి

రజనీకాంత్ హీరోగా నటించడం ఒక ఎత్తు అయితే, ఆయనకు కమల్ హాసన్ లాంటి దిగ్గజం నిర్మాతగా వ్యవహరించడం కోలీవుడ్ హిస్టరీలోనే ఒక సంచలనం

By:  M Prashanth   |   11 Oct 2026 11:30 AM IST
తలైవా, కమల్ మధ్య కుర్ర డైరెక్టర్ కసి
X

రజనీకాంత్ హీరోగా నటించడం ఒక ఎత్తు అయితే, ఆయనకు కమల్ హాసన్ లాంటి దిగ్గజం నిర్మాతగా వ్యవహరించడం కోలీవుడ్ హిస్టరీలోనే ఒక సంచలనం. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే దానికి దర్శకుడు శంకర్ లేదా లోకేష్ కనగరాజ్ రేంజ్ లో ఉండాలని ఎవరైనా ఊహిస్తారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధర్మన్ ప్రాజెక్ట్ బాధ్యతలను అశ్వత్ మారిముత్తు లాంటి యువ దర్శకుడి చేతిలో పెట్టడం బిగ్ ట్విస్ట్.

నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా చాలా మంది సీనియర్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కె.ఎస్ రవికుమార్, సుందర్ సి లాంటి అనుభవజ్ఞుల నుంచి సిబి చక్రవర్తి లాంటి వాళ్ల వరకు రకరకాల ఆప్షన్లు పరిశీలించారు. కానీ ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ అశ్వత్ తలుపు తట్టింది. రజనీకాంత్ ఇమేజ్ కు తగ్గట్టుగా, అదే సమయంలో కమల్ హాసన్ ప్రొడక్షన్ వాల్యూస్ కు సింక్ అయ్యేలా ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ ను ఈ కుర్ర డైరెక్టర్ సిద్ధం చేయడమే ఈ డెసిషన్ వెనుక ఉన్న అసలు కారణం అని ఇండస్ట్రీ టాక్.

ఒక యువ దర్శకుడికి ఇలాంటి అవకాశం రావడం నిజంగా జాక్ పాట్ లాంటిదే. అదే సమయంలో తన కెపాసిటీని నిరూపించుకోవాల్సిన అతిపెద్ద అగ్నిపరీక్ష కూడా ఇదే అని అశ్వత్ ఫీల్ అవుతున్నాడు. రజనీ స్టైల్, కమల్ టేస్ట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఈ క్రమంలోనే రీసెంట్ గా అశ్వత్ చేసిన కొన్ని కామెంట్స్ అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను బయటపెడుతున్నాయి.

షూటింగ్ టైమ్ లో కూడా అశ్వత్ పదే పదే తలైవాతో ఒకటే మాట చెబుతున్నాడట. సార్ ఈ సినిమాను అద్భుతంగా తీసి చూపిస్తానని, తాను అనుకున్న రిజల్ట్ ఇస్తే తనలాంటి కుర్ర దర్శకులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు మీరు నమ్మకం పెంచుకుంటారని రజనీకి ప్రామిస్ చేశాడు. తన సక్సెస్ తో ఇండస్ట్రీలోని యంగ్ టాలెంట్ కు పెద్ద హీరోల దగ్గర తలుపులు తెరవాలనే కసి ఈ డైరెక్టర్ లో కనిపిస్తోంది.

ఇక సెట్స్ లో రజనీకి, డైరెక్టర్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని మొన్నటివరకు కొన్ని రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, అక్టోబర్ నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా యూనిట్ పక్కా ప్లానింగ్ తో వెళ్తోందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా పనుల వల్లే శింబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ ను కూడా అశ్వత్ హోల్డ్ లో పెట్టాడు. దీన్ని బట్టి ధర్మన్ ఔట్ పుట్ మీద అతను ఎంత ఫోకస్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా కొత్త ఐడియాలను నమ్మి రజనీ, కమల్ తీసుకున్న ఈ రిస్క్ వర్కౌట్ అయితే కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి. ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ తో పాటు సాలిడ్ కంటెంట్ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో జైలర్, విక్రమ్ లాంటి సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే తరహాలో అశ్వత్ తెరకెక్కిస్తున్న ధర్మన్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.