Begin typing your search above and press return to search.

నటుడికి, విలక్షణ నటుడికి తేడా ఏంటి?

స్క్రీన్ మీద కనిపించేది అబద్ధం అని తెలిసిన ప్రేక్షకుడిని నమ్మించి ఏడిపించేవాడు నటుడు.

By:  Gopi Velupala   |   8 Oct 2026 9:00 PM IST
నటుడికి, విలక్షణ నటుడికి తేడా ఏంటి?
X

స్క్రీన్ మీద కనిపించేది అబద్ధం అని తెలిసిన ప్రేక్షకుడిని నమ్మించి ఏడిపించేవాడు నటుడు. స్క్రిప్ట్ ప్రకారం దర్శకుడు చెప్పే హద్దుల్లో పాత్రను ప్రదర్శిస్తాడు. తనకంటూ ఒక నిర్థిష్టమైన స్టైల్ ను ఏర్పరచుకుంటాడు. నటులు కొన్నిసార్లు వాళ్ళ కంఫర్ట్ జోన్ కి అలవాటు పడి కథలోని క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్, నటన, డైలాగ్ డెలివరీ లో మార్పులను చూపించక ఆ పాత్రను వాళ్ళ స్టైల్ లోకి మార్చుకుంటారు. దీనివల్ల క్యారెక్టర్ లోని ఫ్రెష్ నెస్ పోయి స్క్రీన్ మీద సినిమాలోని పాత్ర కాకుండా నటుడు కనిపిస్తాడు. దానివల్ల క్యారెక్టర్ లో డెప్త్ క్రియేట్ అవ్వదు. దానివల్ల ప్రేక్షకుడు ఆ పాత్ర ను ఓన్ చేసుకోలేడు.

విలక్షణ నటుడు

సొంత ఇమేజ్ ను పూర్తిగా పక్కనపెట్టి ప్రతి పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆ పాత్ర స్వభావాన్ని బట్టి ఏ భాష మాట్లాడాలి. ఎలా నడవాలి, ఎలా చూడాలి , డైలాగ్ డెలివరీ లో ఎలాంటి వేరియేషన్స్ చూపించాలి అనేవి రీసెర్చ్ చేసి తెలుసుకుంటాడు. విలక్షణ నటులు ఎలాంటి పాత్రనైనా పోషిస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించి వాటికి సరికొత్త రూపాన్ని ఇస్తారు...ఉదాహరణకు కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాస్ రావు లాంటి నటులను విలక్షణ నటులు గా అభివర్ణించవచ్చు...

కమల్ హాసన్ 'విచిత్ర సోదరులు' మూవీలో మరుగుజ్జు అప్పు క్యారెక్టర్ లో వైవిధ్య భరితమైన నటనను కనబరిచాడు.అలాగే 'శుభ సంకల్పం' మూవీలో ఒక మత్స్య కారుడి పాత్ర ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. స్వాతి ముత్యం సినిమాలో లోకజ్ఞానం లేని ఒక అమాయకుడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. 'దశావతారం' లో 10 విభిన్న పాత్రలను పోషించాడు...'ఇంద్రుడు చంద్రుడు' లో ఏజ్ పై బడిన పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో నటించాడు. 'భామని సత్యభామని' లో లేడీ గెటప్ వేసి ఎవ్వరికి సాధ్యం కానీ నటనను కనబరిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ హాసన్ పోషించిన ఇంకా ఎన్నో గొప్ప పాత్రాలున్నాయి...

కోట శ్రీనివాస్ రావు

'ఆహానా పెళ్ళంట' మూవీ లో 'పిసినారి లక్ష్మీపతి' క్యారెక్టర్ ఎన్ని దశాబ్దాలైన గుర్తుండిపోతుంది. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కర్రీ తిన్నట్టుగా ఫీలై పోయి భోజనం చేసే ఆ పిసినారిని మర్చిపోవడం అసాధ్యమే. జంధ్యాల రాసిన క్యారెక్టర్ కి కోట ప్రాణం పోశాడు...'గణేష్' మూవీలో పిల్లి కండ్లతో గుండు పెట్టుకొని కోట పండించిన విలనిజం ఇప్పటికీ జనాల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

ప్రకాష్ రాజ్

33 ఏళ్ల వయస్సులో 60 ఏళ్ల ఒక ముసలాడి పాత్ర చేయడం మాములు విషయం కాదు. కొంచెం తేడా కొట్టిన నటుడు, డైరెక్టర్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొక తప్పదు. 'అంతఃపురం' సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయిన 'నరసింహ' అనే వ్యక్తి ఎంత క్రూరంగా ఉంటాడు. ఆయన నడకలో ఎలాంటి తేడా ఉంటుంది. కొడుకును పోగొట్టుకున్నప్పుడు పడే బాధ ఎలా ఉంటుంది. శత్రువును చంపినప్పుడు ఎలాంటి క్రూరమైన సంతోషాన్ని ఆస్వాదిస్తాడు అనేది పర్ఫెక్ట్ ప్రకాష్ రాజ్ అచ్చుగుద్దినట్టుగా నటించి మెప్పించాడు...

ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడం తో నరసింహా పాత్ర ప్రకాష్ రాజ్ విన్న వెంటనే ఆ పాత్ర ఎలా ఉండాలి అనేది డైరెక్టర్ తో పాటు తను కూడా సెర్చ్ చేశాడు. నరసింహ ఊరు మనిషి కాబట్టి తాను నడిచేటప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తాడు. తను ఎక్కడికి వెళ్లిన నడుచుకుంటూనే వెళ్తాడని వెహికల్స్ ను పెద్ద వాడడు. కాబట్టి గమ్యాన్ని తొందరగా చేరుకోవడానికి ఆయన పెద్ద అడుగులు వేస్తాడని అప్పట్లో చాలా మంది ఇలానే నడిచేవారని ప్రకాష్ రాజ్ ఆ ఏరియా వ్యక్తుల గురించి రీసెర్చ్ చేసి చెప్పాడట. దాంతో ఆ విషయం కృష్ణవంశీ కి బాగా నచ్చి దాన్ని సినిమాలో పెట్టుకున్నాడు...

'బొమ్మరిల్లు' మూవీలో అనుక్షణం కొడుకు గురించి ఆలోచించే ఒక తండ్రి పాత్రలో అసాధారణమైన నటనను చూపించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు... 'పోకిరి' లో అలీ భాయి గా కనిపించాడు. తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికి ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇలా ప్రకాష్ రాజ్ చాలా గొప్ప నటుడి గా ఎదిగాడు. వీటితో పాటు ఆయనకి పేరు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి...