Begin typing your search above and press return to search.

'భార‌తీయుడు-3' ని మ‌ర్చిపోవాల్సిందేనా?

భారతీయ చలనచిత్ర చరిత్రలో 'భారతీయుడు' చిత్రానికి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్-శంకర్ కలయికలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది.

By:  Srikanth Kontham   |   18 July 2026 8:00 AM IST
భార‌తీయుడు-3 ని మ‌ర్చిపోవాల్సిందేనా?
X

భారతీయ చలనచిత్ర చరిత్రలో 'భారతీయుడు' చిత్రానికి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్-శంకర్ కలయికలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. అయితే 'భారతీయుడు 2' తర్వాత వస్తుందని ప్రచారం జరిగిన 'భారతీయుడు 3' ప్రాజెక్ట్ పరిస్థితి అనేక ప్రశ్నలకు తావిస్తోంది. థియేట్రికల్ విడుదల గురించి కానీ, ఓటిటి స్ట్రీమింగ్ గురించి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెల‌కొంటుంది. కొన్ని నెల‌లుగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ కూడా రాకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

సాధారణంగా ఓ భారీ బడ్జెట్ చిత్రం సిద్ధమైనప్పుడు ప్రమోషన్లు వేగంగా జరుగుతాయి. కానీ 'భారతీయుడు 3' విషయంలో చిత్ర బృందం పూర్తిగా మౌనం దాల్చడం ప్రాజెక్టును నిర్మాతలు పక్కన పెట్టేసినట్లు సంకేతాలిస్తోంది. టెక్నిక‌ల్ గా కొన్ని ర‌కాల ఇబ్బందులున్న మాట వాస్త‌వం. కానీ ఆ ప‌రిస్థితులు ఎలా ఉన్నా? క‌చ్చితంగా థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తామ‌ని ఆ మ‌ధ్య శంక‌ర్ చాలా బ‌లంగా చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యిందని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

అయితే కమల్ హాసన్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా ఇలా మధ్యలోనే ఆగిపోవడం వెనుక ఉన్న అస‌లైన‌ కారణాలపై స్పష్టత లేకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. ఇక ఓటిటి వేదికల పరిస్థితి చూస్తే పాత సినిమాలు .. కొత్త ప్రయోగాత్మక చిత్రాలతో ఓటిటి సంస్థలు బిజీగా ఉన్నాయి. ఒకవేళ `భారతీయుడు 3` విడుద లయ్యే ఉద్దేశ్యం ఉంటే? ఏదో ఒక ఓటిటి సంస్థతో ఒప్పందం జరిగి ఉండేది. కానీ అలాంటి వార్తలు కూడా ఏవీ బయటకు రాకపోవడం చూస్తుంటే? ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింద నిపిస్తోంది.

ప్రేక్షకుల ఆసక్తిని కాపాడుకోవడంలో మేకర్లు విఫలమవుతున్నారా? అన్నది ఆలోచించాల్సిన విషయం. ఒక చిత్రానికి ప్రాణం పోయడం ఎంత ముఖ్యమో? దానిని సరైన రీతిలో ప్రేక్షకుల వద్దకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. `భారతీయుడు 2` తర్వాత వచ్చిన మిశ్రమ స్పందనలు కూడా `భారతీయుడు 3` విడుదలలో జాప్యానికి కారణమై ఉండవచ్చు. నిర్మాతలు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రాజెక్టును నిలిపివేసి ఉంటారనేది ట్రేడ్ వర్గాల బలమైన అనుమానం వ్య‌క్త‌మ‌వుతోఎంది. మేధోమథనం చేసి భారీ ప్రాజెక్టును ప్లాన్ చేయడం తేలికే కానీ దాన్ని విజయవంతంగా తెరపైకి తేవడం ఎంత కష్టమో? ఈ ఘటన మ‌ర‌సారి గుర్తు చేస్తోంది.

చివ‌రిగా `భారతీయుడు 3` అనేది కనుమరుగవుతున్న ప్రాజెక్టుగా మిగిలిపోయే ప్రమాదం లేక‌పోలేదు. అభిమానులు ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నా? పరిస్థితులు మాత్రం ఆ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తే అభిమానుల ఎదురు చూపులకు తెరపడేది. ఏది ఏమైనా? శంకర్ - కమల్ హాసన్ లాంటి దిగ్గజాల కాంబినేషన్‌లో రావాల్సిన చిత్రం ఇలా డిలే అవ్వ‌డం బాధాకర విషయం.