కమల్ హాసన్ బోయ్స్ డాడీలా!
ఇప్పుడీ స్టోరీ అంతా దేనికంటారా? సరిగ్గా ఇలాంటి సన్నివేశమే విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ లో కూడా ఒకటుందని వెలుగులోకి వచ్చింది.
By: Srikanth Kontham | 27 Aug 2025 11:38 AM IST'బోయ్స్' సినిమాలో హీరోయిన్ పేరు హరిణి ( జెనిలియా ). తన తండ్రి ఈ పేరు పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంటుంది. మంచి జీవితం కోసం ప్రేమించిన ప్రియురాలిని వదులుకుంటాడు అందులో జెనిలియా తండ్రి . ఆ ప్రియురాలు పేరు హరిణి. ఆ ప్రియురాలు గుర్తుగానే కుమార్తెకు ఆ పేరు పెడతాడు. మనసులో హరిణి అంటే చచ్చేంత ప్రేమ ఉన్నా? వాస్తవ జీవితం వేరుగా ఉంటుంది. కోరుకున్న లైఫ్ కావాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. ఆ త్యాగం నుంచి పుట్టిందే హరిణి పేరు.
ఇప్పుడీ స్టోరీ అంతా దేనికంటారా? సరిగ్గా ఇలాంటి సన్నివేశమే విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ లో కూడా ఒకటుందని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెప్పటం ఇంకా వివేషం. ఏకంగా నాన్న ప్రేమ కథ చెప్పి? ఆ నాటి హరిణిని గుర్తు చేసింది. కమల్ హాసన్ బెంగాలీ భాష నేర్చుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగా అపర్ణ అనే ప్రియురాలు. అపర్ణ అంటే కమల్ కి చచ్చేంత ప్రేమ అట. ఆవిడే కమల్ ఫస్ట్ లవ్. అపర్ణ పరిచయయ్యే సమయానికి బెంగాలీ రాకపోవడంతో ఎలాగైనా ఆమెను ఆకట్టుకోవాలని ప్రత్యేకంగా బెంగాలీ క్లాస్ లకు వెళ్లి మరీ నేర్చుకున్నారు.
అంతే కాదు 'హేరామ్' సినిమాలో రాణీ ముఖర్జీ పోషించిన పాత్రకు కూడా అపర్ణ అనే పేరు పెట్టింది నాన్న అంది. ఇదంతా కేవలం అపర్ణపై ఉన్న అభిమానం, ఇష్టంతోనే చేసారంది. అదీ కమల్ హాసన్ మొదటి ప్రియురాలు వెనుక కహానీ. శ్రుతి హాసన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ నెటి జనుడు కమల్ గురించి మాకు తెలియని మరో ప్రేమ కథ అంటూ పోస్ట్ పెట్టాడు. కమల్ హాసన్ సినిమాల్లోనే ఆయన వ్యక్తిగత జీవితంలోచాలా ప్రేమ కథలే ఉన్నాయంటూ మరోకరు మరో పోస్ట్ పెట్టారు.
కమల్ హాసన్ తొలుత వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. కానీ మనస్పర్దలు కారణంగా ఆ దంపతులు 1988లోనే విడిపోయారు. అటుపై సారికా ఠాకూరు ను 1991లో రెండవ వివాహం చేసుకున్నారు. కానీ 13 ఏళ్ల ధాంపత్య జీవితం అనంతరం 2004 లో విడిపోయారు. అటుపై తెలుగు నటి గౌతమితో 11 ఏళ్ల పాటు రిలేషన్ షిప్ నికొనసాగించారు. అనంతరం ఆ బంధం కూడా వీగిపోయింది. ప్రస్తుతం కమల్ సింగిల్ గానే ఉంటున్నారు.
