Begin typing your search above and press return to search.

కమల్ సినిమాలకు బీజేపీ సెగ

ఇప్పుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆయన సినిమాలను హిందువులు చూడడం మానేయాలని బీజేపీ పిలుపునిచ్చింది!

By:  M Prashanth   |   6 Aug 2025 12:56 PM IST
కమల్ సినిమాలకు బీజేపీ సెగ
X

ప్రముఖ హీరో కమల్ హాసన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారుతుంటారు. దీంతో తరచూ వివాదాలు రేగుతుంటాయి. రీసెంట్ గా తన మూవీ థగ్ లైఫ్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా కర్ణాటకలో ఆ సినిమా రిలీజ్ కూడా కాకుండా అయిపోయింది.

ఇప్పుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆయన సినిమాలను హిందువులు చూడడం మానేయాలని బీజేపీ పిలుపునిచ్చింది! కమల్ చిత్రాలను బాయ్ కాట్ చేయాలని తమిళనాడు బీజేపీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"అప్పుడు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. హిందువులు అందరూ కూడా కమల్ సినిమాలను బాయ్‌ కాట్ చేయాలి. ఓటీటీలో కూడా చూడకూడదు. అప్పుడే సనాతన ధర్మంపై పిచ్చి కామెంట్లు చేయడానికి భయపడతారు" అని అన్నారు.

అయితే రీసెంట్ గా సినీ నటుడు సూర్య ఎడ్యుకేషన్ చారిటీ అయిన అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కమల్, పలు వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య అని కమల్ అన్నారు. ప్రజలు మరే ఆయుధాన్ని చేతిలోకి తీసుకోకుండా కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలని తెలిపారు.

దీంతో బీజేపీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి వీడియో రిలీజ్ చేస్తూ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతానికి విడుదలకు ఆయన వద్ద ఏ ప్రాజెక్ట్ సిద్ధంగా లేదు. కానీ మరికొద్ది రోజుల్లో భారతీయుడు-3 విడుదల కానుంది. త్వరలో మిగిలిన షూటింగ్ పార్ట్ ను మేకర్స్ కంప్లీట్ చేయనున్నారు.

దీంతో ఆ సినిమాకు బాయ్ కాట్ సెగ తగిలే అవకాశం ఉంది. అయితే ఆయన లీడ్ రోల్ లో నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. శంకర్ దర్శకత్వంలో నటించిన భారతీయుడు 2 డిజాస్టర్ గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో చేసిన థగ్ లైఫ్ తేలిపోయింది. రెండు సినిమాలు కూడా మేకర్స్ కు భారీ నష్టాలు మిగిల్చాయి.