ప్రాణ స్నేహితుడుతో కమల్ భారీ ప్లాన్
అయితే నిర్మాతగా కమల్ హాసన్ నెక్ట్స్ ఫేజ్ ను చూసింది మాత్రం విక్రమ్ మూవీ తోనే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 11:48 AM ISTకమల్ హాసన్ నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా పలు సినిమాలు చేశారు. నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించిన లోక నాయకుడు వాటిలో కొన్ని సినిమాలతో హిట్లు అందుకుంటే మరికొన్ని సినిమాలతో ఫ్లాపులను అందుకున్నారు. అయితే నిర్మాతగా కమల్ హాసన్ నెక్ట్స్ ఫేజ్ ను చూసింది మాత్రం విక్రమ్ మూవీ తోనే.
విక్రమ్ తో భారీ సక్సెస్ ను అందుకున్న కమల్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో వచ్చిన విక్రమ్ మూవీతో కమల్ హీరోగా ఫ్లాపుల పరంపరకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కమల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా విక్రమ్ నిలిచింది. విక్రమ్ కథ పైన, డైరెక్టర్ లోకేష్ పైన ఉన్న నమ్మకంతో విక్రమ్ మూవీని కమల్ హాసనే స్వయంగా తన బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో నిర్మించారు.
అమరన్ తో నిర్మాతగా మంచి లాభాలు
విక్రమ్ సినిమాను నిర్మించడమే కాకుండా ఆ సినిమాను సొంతంగా రిలీజ్ చేసి భారీ లాభాలను అందుకున్న కమల్, విక్రమ్ సక్సెస్ తర్వాత నిర్మాతగా బిజీగా మారారు. విక్రమ్ తర్వాత శివ కార్తికేయన్ అమరన్ సినిమా వచ్చింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించిన అత్యంత ఖరీదైన మూవీగా వచ్చిన అమరన్, భారీ విజయాన్ని అందుకుని కమల్ కు గొప్ప లాభాలను తెచ్చిపెట్టింది.
రజినీతో కమల్ నిర్మాతగా..
ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు కమల్ హాసన్ తన బ్యానర్ లో మరో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుండగా, దాన్ని కమల్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు రాజ్‌కమల్ బ్యానర్ లో తెరకెక్కిన అన్ని సినిమాల కంటే దీన్ని ఎక్కువ బడ్జెట్ తో రూపొందించనున్నారని సమాచారం. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ సినిమాను మొదలుపెట్టి 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారని, జైలర్2 తర్వాత రజినీ నుంచి రాబోయే సినిమా ఇదే కానుందని తెలుస్తోంది. తన ప్రాణ స్నేహితుడు రజినీతో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు కోసం కమల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని, ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు అన్నీ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుతో పెద్ద సక్సెస్ ను అందుకుని మూవీని స్పెషల్ గా నిలపడానికి కమల్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
