`అరుంధతి` సీక్వెల్ తీస్తే ఆ పాత్రను మోయగల అర్హత ఉన్న నటి!
తెలుగు సినీ పరిశ్రమలో పౌరాణిక డ్రామాలు, లేడీ ఓరియెంటెడ్ కథాంశాలలో నటించి మెప్పించగల సమర్థత అనుష్క శెట్టికి ఉంది.
By: Sivaji Kontham | 13 Aug 2026 7:10 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో పౌరాణిక డ్రామాలు, లేడీ ఓరియెంటెడ్ కథాంశాలలో నటించి మెప్పించగల సమర్థత అనుష్క శెట్టికి ఉంది. `అరుంధతి`గా అనుష్క శెట్టి చూపించిన అభినయం, తెగవ ఇప్పటికీ ఒక సంచలనమే. అయితే అనుష్క తర్వాత అంతటి గంభీరమైన, బలమైన పాత్రను మోయగల సామర్థ్యం `ఒడ్డు పొడుగు` ఒక్క తెలుగమ్మాయి కామాక్షికే ఉందంటూ సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొనియాడారు. అనుష్క తర్వాత అరుంధతి లాంటి పాత్రలో సత్తా చాటే అవకాశం ఉందనే భావనను ఆయన కనబరిచారు. వైవిధ్యమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్న కామాక్షి, అనుష్కతో పోలిక రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం `అగధ`లో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 14న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కామాక్షి సినిమా విశేషాలను పంచుకోవడంతో పాటు.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తండ్రి స్థానంలో ఉండి తనను అనుష్కతో పోల్చడం ఎంతో గౌరవంగా ఉందనీ.. అది తనపై మరింత బాధ్యతను పెంచిందని సరదాగా నవ్వుతూ వెల్లడించారు.
డాక్టర్ వృత్తి నేపథ్యం నుండి వచ్చి నటనపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన కామాక్షి భాస్కర్ల ప్రారంభం నుంచీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. ఈ తెలుగమ్మాయికి ఉన్న ఆకట్టుకునే రాయల్ పర్సనాలిటీ తెరపై కనిపించే గాంభీర్యం తనను ఇతర కథానాయికల నుంచి భిన్నంగా నిలబెడుతున్నాయి. `అరుంధతి` లాంటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నోటి నుండి ఈ తరహా ప్రశంసలు రావడం కామాక్షి నటనకు దక్కిన అతిపెద్ద గౌరవంగా భావించవచ్చు.
మొత్తానికి రేపు (ఆగస్టు 14న) గ్రాండ్‌గా విడుదలవుతున్న `అగధ` సినిమా కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా నిలవబోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా సాగుతున్న ఈ తెలుగమ్మాయి ప్రయాణం.. భవిష్యత్తులో టాలీవుడ్ అగ్ర నాయికల సరసన నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి సీక్వెల్ ని తెరకెక్కిస్తే, కామాక్షికి అవకాశం ఇస్తారేమో చూడాలి.
`అగధ` చిత్రంలో కామాక్షితో పాటు శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనితా విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయ రాణి రెడ్డి, వివా రాఘవ, కనకవ్వ తదితర తారాగణం కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన సస్పెన్స్ ఎమోషనల్ కంటెంట్ డ్రివెన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. టీజర్, ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
